60 ఏళ్ల వయసులో 18 కిలోల బరువు తగ్గిన అమీర్ ఖాన్: ‘మ్యాజిక్’లా పనిచేసిన ‘యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్’!

వచ్చే మార్చిలో 61వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్న అమీర్ ఖాన్, తాను 18 కిలోల బరువు తగ్గానని వెల్లడించారు. అయితే ఈ మార్పు కఠినమైన వర్కవుట్ల వల్ల రాలేదని, ఒక ప్రత్యేకమైన ఆహార నియమావళి (యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్) వల్ల సాధ్యమైందని ఆయన తెలిపారు.

ఈ డైట్ ఎందుకు ప్రారంభించారు? జనవరి 14న ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అమీర్ మాట్లాడుతూ.. తాను బరువు తగ్గడం కోసం ఈ డైట్ మొదలుపెట్టలేదని, దీర్ఘకాలంగా వేధిస్తున్న మైగ్రేన్ (పార్శ్వనొప్పి) సమస్య నుండి ఉపశమనం కోసం దీనిని అనుసరించానని చెప్పారు. “ఈ డైట్ నాకు మ్యాజిక్ లా పనిచేసింది. కేవలం బరువు తగ్గడమే కాదు, నా మైగ్రేన్ సమస్య కూడా గణనీయంగా తగ్గింది” అని ఆయన పేర్కొన్నారు.

బరువు పెరగడానికి ‘వాపు’ (Inflammation) ఎలా కారణం? మనం సరైన నిద్ర లేకపోయినా, ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర, ఆల్కహాల్ వంటివి తీసుకున్నా శరీరంలో ‘సైటోకిన్స్’ అనే రసాయనాలు విడుదలవుతాయి. ఇవి ఇన్సులిన్ మరియు లెప్టిన్ (ఆకలిని నియంత్రించే హార్మోన్) పనితీరును దెబ్బతీస్తాయి. దీనివల్ల శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోయి బరువు పెరుగుతారు.

ఏయే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి? న్యూట్రిషనిస్టుల సలహా ప్రకారం ఈ డైట్‌లో కింది వాటిని నివారించాలి:

  • చక్కెర పానీయాలు: సాఫ్ట్ డ్రింక్స్, పండ్ల రసాలు.
  • నూనెలు: సన్‌ఫ్లవర్, సోయాబీన్ వంటి రిఫైన్డ్ నూనెలు.
  • జంక్ ఫుడ్: డీప్ ఫ్రై చేసిన పదార్థాలు, బేకరీ వస్తువులు.
  • ప్రాసెస్ చేసిన మాంసం: సాసేజ్, సలామీ వంటివి.
  • శుద్ధి చేసిన ధాన్యాలు: తెల్ల బియ్యం (వైట్ రైస్), మైదా.

Posted

in

by

Tags: