పాకిస్థాన్‌లోని రావల్పిండికి చెందిన ఒక ప్రేమకథ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. 70 ఏళ్ల ప్రముఖ మౌలానా (హకీమ్ సాహెబ్), తనకంటే 44 ఏళ్లు చిన్నదైన 26 ఏళ్ల యువతిని నికా (వివాహం) చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి కంటే, వారు చేసుకున్న ‘ఫిల్మీ’ స్టైల్ ఫోటోషూట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
వైరల్ అవుతున్న వీడియోలో, మౌలానా తన కొత్త భార్య ఒడిలో తల పెట్టుకుని ఫోజులిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో సల్మాన్ ఖాన్ సినిమాలోని ‘దిల్ దియా గల్లా’ పాట వినిపిస్తుండగా, వధువు ఆ పాటను పాడుతోంది, హకీమ్ సాహెబ్ కూడా ఆమెతో కలిసి గొంతు కలిపారు.
ఫోటోగ్రాఫర్ హడావుడి: ఈ ఫోటోషూట్‌లో కేవలం వధూవరులే కాకుండా, ఫోటోగ్రాఫర్ కూడా వైరల్ అయ్యారు. మంచి షాట్ కోసం అతను నేలపై పడుకుని రకరకాల యాంగిల్స్‌లో ఫోటోలు తీయడం చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఈ వీడియో ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ అవ్వగానే కామెంట్ల వర్షం కురిసింది. “ఫోటోలు వచ్చేలోపు చాచాకు పైనుంచి పిలుపు రాకుండా ఉంటే చాలు” అని ఒకరు, “ఈయన మా నాన్న వయస్సు వారు, ఏం చూసి పెళ్లి చేసుకుంది?” అని మరొకరు కామెంట్ చేశారు.
అసలు విషయం ఏమిటి? ఈ వార్త నిజమేనా అని ఆరా తీయగా, ఇది రావల్పిండిలో జరిగిన ఘటన అని తేలింది. అయితే వివాదం పెరగడంతో ‘డైలీ పాకిస్థాన్’ ఈ క్లిప్‌ను తమ వెబ్సైట్ నుండి తొలగించింది. ఒక నెటిజన్ సమాచారం ప్రకారం.. సదరు హకీమ్‌కు ఇదివరకే ముగ్గురు భార్యలు, 19 మంది పిల్లలు ఉన్నారని, ఇప్పుడు ఈ 26 ఏళ్ల యువతిని నాలుగో పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది.
