రియాద్: సౌదీ అరేబియాలో జరిగిన ఒక వింత వివాహం ప్రస్తుతం సోషల్ మీడియాలో దావాగ్నంలా వ్యాపించి పెద్ద చర్చకు దారితీసింది.
70 ఏళ్ల వయసున్న ఒక కోటీశ్వర షేక్, తనకంటే 51 ఏళ్లు చిన్నదైన.. అంటే కేవలం 19 ఏళ్ల వయసున్న యువతిని వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లిలో వరుడు తన యువ భార్యకు 5 కిలోల బంగారం మరియు కోట్లాది రూపాయల విలువైన ‘రోల్స్ రాయిస్’ (Rolls-Royce) లగ్జరీ కారును కానుకగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. వధువు ముఖంలో మెరుస్తున్న ఆ చిరునవ్వుకు కారణం భర్తపై ఉన్న ప్రేమనా లేక ఆయన ఇచ్చిన కోట్ల విలువైన కట్నకానుకలా అని నెటిజన్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.
ఈ వివాహ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు దీన్ని ‘డబ్బు కోసం ఆడుతున్న నాటకం’ అని, మరికొందరు ‘అద్భుతమైన భవిష్యత్తు ప్రణాళిక’ అని ఎద్దేవా చేస్తున్నారు. అదే సమయంలో, ఒక వర్గం వారు ఇది కృత్రిమ మేధస్సు (AI) ద్వారా సృష్టించబడిన నకిలీ వీడియో (Fake Video) అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, వయసు వ్యత్యాసం ఒక పక్కన ఉంటే.. ఆ వృద్ధుడి దాతృత్వం మరియు ఆ వివాహ వైభవం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా (Talk of the town) మారాయి.
