“8 ఏళ్ల తర్వాత కూడా సద్దుమణగని తుఫాను”. ఆసీస్ క్రికెట్‌ను కుదిపేస్తున్న శాండ్‌పేపర్ వివాదం. రహస్యాలను బట్టబయలు చేసిన ఖవాజా. చివర్లో మిచెల్ స్టార్క్ ఇలా అన్నాడేంటి. అసలేం జరిగింది..?

గత 2018లో ప్రపంచ క్రికెట్‌ను కుదిపేసిన ఆస్ట్రేలియా ‘శాండ్‌పేపర్’ బాల్ టాంపరింగ్ వివాదం, ఇప్పుడు మళ్లీ క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

ఆస్ట్రేలియా ఆటగాడు ఉస్మాన్ ఖవాజా రాసిన కొత్త ఆత్మకథ పుస్తకంలో ఈ ఘటనకు సంబంధించిన పలు కొత్త రహస్యాలు, నిజాలు వెలుగులోకి రావడమే ఇందుకు ప్రధాన కారణం.

ఈ నేపథ్యంలో, బాల్ టాంపరింగ్ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని, 2021లో తాము ఇచ్చిన వాంగ్మూలానికే నేటికీ కట్టుబడి ఉన్నామని ఆస్ట్రేలియా ప్రముఖ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ స్పష్టం చేశాడు.

ఉస్మాన్ ఖవాజా రాసిన ఈ కొత్త పుస్తకం నవంబర్ 10న విడుదలైంది. అందులో 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో చోటుచేసుకున్న వివాదాస్పద ఘటనల గురించి ఆయన వివరంగా రాశాడు. అయితే, ఎవరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో తాను ఈ పుస్తకం రాయలేదని ఖవాజా తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో వివరణ ఇచ్చినప్పటికీ, ఈ వ్యవహారం ఆస్ట్రేలియా మాజీ, ప్రస్తుత ఆటగాళ్ల మధ్య మళ్లీ చిచ్చురేపింది.

దీనిపై మిచెల్ స్టార్క్ స్పందిస్తూ.. “మా పాత వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. ఇన్నేళ్ల క్రితం ఏం జరిగిందో, ఈ రోజు కూడా మేం అదే స్టాండ్‌తో ఉన్నాం” అని ఖవాజా పుస్తకంలోని వ్యాఖ్యలను తోసిపుచ్చాడు. బాల్ టాంపరింగ్ వ్యవహారం బౌలర్లకు ముందుగానే తెలుసని కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ చేసిన ఆరోపణల నేపథ్యంలో, 2021లో స్టార్క్, కమిన్స్, హేజిల్‌వుడ్, నాథన్ లియోన్ సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ ఆ ఆరోపణలను ఖండించిన విషయం తెలిసిందే.

తాజాగా విడుదలైన ఖవాజా పుస్తకంపై స్టార్క్ మాట్లాడుతూ, “నిజం చెప్పాలంటే నేను ఆ పుస్తకాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన గురించి చాలా మంది రకరకాలుగా మాట్లాడొచ్చు. ఆ రోజు మేం ఏం చెప్పామో, ఈ రోజు కూడా మాది అదే స్టాండ్. మైదానంలో ఏం జరుగుతుందనే దానిపై మాకు ముందుగా ఎలాంటి సమాచారం లేదు” అని తేల్చి చెప్పాడు. ఎనిమిదేళ్లు గడిచినా ఆస్ట్రేలియా క్రికెట్‌ను వెంటాడుతున్న ఈ శాండ్‌పేపర్ భూతం, ఇప్పుడు కొత్త పుస్తకం ద్వారా మళ్లీ అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *