8 ఏళ్ల వయసులో మాట ఇచ్చి.. మోసం చేసిన భాగ్యరాజ్! స్టేజీపై అసలు విషయం బయటపెట్టిన కోవై సరళ

తమిళ సినీ రంగంలో దర్శకుడిగా, నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న భాగ్యరాజ్, నటి కోవై సరళను చిన్నప్పుడే ప్రోత్సహించారు. అయితే, ఆయన తనను హీరోయిన్‌ను చేస్తానని చెప్పి మోసం చేశారని కోవై సరళ ఒక కార్యక్రమంలో సరదాగా వ్యాఖ్యానించారు.

ఏం జరిగిందంటే? ఒక కార్యక్రమంలో భాగ్యరాజ్ మాట్లాడుతూ.. “కోవై సరళ చిన్నపిల్లగా ఉన్నప్పుడే నేను ఆమెతో చెప్పాను.. మీ అక్క కంటే నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు సినిమాల్లోకి వస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది అని. అప్పటికి నేను కూడా సినిమాల్లోకి రాలేదు. ఆ తర్వాత నేను దర్శకుడిగా మారి ‘ముందానై ముడిచ్చు’ (తెలుగులో ‘అందాల రాముడు’) సినిమా చేస్తున్నప్పుడు, ఆమె నా దగ్గరకు వచ్చి గొడవ చేసి మరి అవకాశం దక్కించుకుంది. ‘మీరు పిలిచినా పిలవకపోయినా నేను బట్టల సంచితో షూటింగ్ స్పాట్‌కు వచ్చేస్తాను’ అని ఆమె పట్టుబట్టింది” అని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

అమ్మ పాత్రలో కోవై సరళ: ‘చిన్న వీడు’ చిత్రంలో భాగ్యరాజ్ తనకు తల్లిగా నటించమని కోవై సరళను అడిగారు. అప్పుడు ఆమె “అప్పుడే అమ్మ పాత్రనా?” అని ఆశ్చర్యపోయినా.. “నీ యాస (Slang) ఈ సినిమాకు ప్రాణం పోస్తుంది, నీపై నాకు నమ్మకం ఉంది” అని భాగ్యరాజ్ ఆమెను ఒప్పించారు. ఆ పాత్రలో ఆమె అద్భుతంగా నటించి అందరినీ మెప్పించింది.

కోవై సరళ స్పందన: భాగ్యరాజ్ మాటలకు స్పందిస్తూ.. “ఎనిమిదేళ్ల వయసులో నన్ను హీరోయిన్‌ను చేస్తానని చెప్పి, ఆ తర్వాత నేరుగా అమ్మ పాత్ర ఇచ్చి భాగ్యరాజ్ నన్ను మోసం చేశారు” అని కోవై సరళ నవ్వుతూ స్టేజీపైనే వ్యాఖ్యానించారు.


Posted

in

by

Tags: