నేటి కాలంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు 60 ఏళ్ల తర్వాత వచ్చే హార్ట్ ఎటాక్, నేడు 20-30 ఏళ్ల యువకుల్లో కూడా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లే. అయితే, మనం రోజూ చేసే ఒక అతి సాధారణ అలవాటు కూడా గుండెపోటుకు దారితీస్తుందని ఒక జపనీస్ కార్డియాలజిస్ట్ తన పరిశోధనలో తేల్చారు.
22 ఏళ్ల పరిశోధనలో తేలిన షాకింగ్ నిజం: డాక్టర్ శ్రేయ గార్గ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒక జపనీస్ కార్డియాలజిస్ట్ సుమారు 22 ఏళ్ల పాటు పూర్తిగా ఫిట్‌గా ఉన్న వ్యక్తులపై పరిశోధన చేశారు. వీరికి పొగత్రాగే అలవాటు లేదు, బరువు కూడా అదుపులోనే ఉంది మరియు కుటుంబంలో ఎవరికీ గుండె సమస్యలు లేవు. అయినప్పటికీ, వీరికి 40-50 ఏళ్ల మధ్యలో గుండెపోటు వచ్చింది. వీరిందరిలో ఉన్న ఒకే ఒక ఉమ్మడి అలవాటు ఏమిటంటే – వీరు తమ రోజును ‘స్ట్రెస్ మోడ్’ (Stress Mode) లో ప్రారంభించడం. అంటే కళ్లు తెరిచిన వెంటనే శరీరాన్ని ఒక్కసారిగా యాక్టివ్ మోడ్‌లోకి తీసుకెళ్లడం.
నిద్ర లేవగానే నిలబడటం ప్రమాదకరం: చాలా మంది నిద్ర లేవగానే లేదా కళ్లు తెరిచిన వెంటనే మంచం మీద నుండి గబుక్కున లేచి నిలబడతారు. ఇదే అతిపెద్ద తప్పు. ఆ సమయంలో మన మెదడు మేల్కొంటుంది కానీ శరీరం ఇంకా విశ్రాంతి స్థితిలోనే ఉంటుంది. మీరు ఒక్కసారిగా లేచి నిలబడటం వల్ల:
- రక్తపోటు (Blood Pressure) వేగంగా పెరుగుతుంది.
- స్ట్రెస్ హార్మోన్ అయిన ‘కార్టిసోల్’ స్థాయిలు పెరుగుతాయి.
- రక్తనాళాలు కుంచించుకుపోతాయి. ఇది యువకుల గుండెపై ఒత్తిడిని కలిగిస్తే, వృద్ధులకు అది ప్రాణాపాయంగా మారుతుంది.
ఉదయం మొదటి 60 సెకన్లు చాలా కీలకం: మనం నిద్ర నుండి అకస్మాత్తుగా లేచి నిలబడినప్పుడు మన శరీరం ఒక్కసారిగా భయాందోళనకు (Panic) గురవుతుంది. మనం కేవలం నిద్ర లేస్తున్నామని అనుకుంటాం కానీ, మన శరీరం ఏదో దాడి (Attack) జరుగుతోందని భావిస్తుంది. అందుకే ఉదయం మొదటి 60 సెకన్లు మిగిలిన 24 గంటల గుండె ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి.
నిద్ర లేవడానికి సరైన పద్ధతి ఏమిటి? జపనీస్ ఆసుపత్రుల్లో అనుసరించే పద్ధతి ప్రకారం:
- నిద్ర లేవగానే వెంటనే నిలబడకూడదు.
- కాసేపు అలాగే మంచంపై పడుకోవాలి.
- నెమ్మదిగా 4 సార్లు చిన్నగా శ్వాస తీసుకోవాలి.
- ఆ తర్వాత తల వంచుకుని మంచంపై కూర్చోవాలి.
- కనీసం 10 సెకన్ల పాటు అలాగే కూర్చున్న తర్వాతే నిలబడాలి. ఈ చిన్న అలవాటు వల్ల శరీరానికి సర్దుబాటు చేసుకోవడానికి సమయం దొరుకుతుంది మరియు గుండెపై ఒత్తిడి పడదు.
