81 ఏళ్ల వయసులో భార్య కోసం విశ్రాంతి లేకుండా పనిచేసిన వృద్ధుడు..! రోజూ 14 గంటల పాటు డెలివరీ పనులు చేసిన విషాదం.. బరువైన పార్శిల్ మోస్తూ పడుతున్న కష్టం చూసి ఓ మహిళ చేసిన పని.. ఒక్క రోజులోనే మారిపోయిన ఆ వృద్ధుడి జీవితం..?!

టెక్సాస్‌కు చెందిన 81 ఏళ్ల డాన్ జాన్సన్.. క్యాన్సర్‌తో బాధపడుతున్న తన భార్య జోసెఫిన్ వైద్య ఖర్చుల కోసం రోజుకు 14 గంటల పాటు కష్టపడి పనిచేస్తున్నాడు. అమెజాన్, వాల్‌మార్ట్ వంటి సంస్థలు ఆయన వయసును కారణంగా చూపుతూ ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించడంతో, వేరే దారి లేక విమానాశ్రయాల్లో ప్రయాణికులు పోగొట్టుకున్న లగేజీని (lost baggage) వారి ఇళ్లకు వెళ్లి డెలివరీ చేసే అత్యంత కష్టమైన పనిలో చేరాడు.

ఇటీవల ఎరిన్ హోవెల్ అనే మహిళ ఇంటికి వెళ్లి ఒక బరువైన బ్యాగ్‌ని డెలివరీ చేస్తున్నప్పుడు, డాన్ ఆయాసంతో తడబడుతూ మెట్లు ఎక్కిన దృశ్యాలు ఆమె ఇంటి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ వీడియో చూసిన ఎరిన్.. డాన్ పేదరికం, భార్య వైద్యం కోసం ఆయన పడుతున్న ఆరాటం గురించి అడిగి తెలుసుకుని తీవ్ర ఆవేదనకు గురైంది.

డాన్ దయనీయ స్థితిని చూసి చలించిపోయిన ఎరిన్, ఆ వృద్ధ దంపతులకు సాయం చేసేందుకు సెప్టెంబర్ 2న ‘GoFundMe’ ప్లాట్‌ఫారమ్‌లో విరాళాల సేకరణను ప్రారంభించింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ప్రయత్నం ద్వారా ఏకంగా $2,44,000 (రూ. 2.87 కోట్లకు పైగా) విరాళాలు పోగుపడ్డాయి.

ప్రజలు అందించిన ఈ భారీ ఆర్థిక సాయం, వారి ప్రార్థనలు డాన్-జోసెఫిన్ దంపతుల్లో కొత్త ఆశలను నింపాయి. ఈ సాయంతో త్వరలోనే తాను ఈ కష్టమైన పని నుంచి విరమణ తీసుకుని, తన భార్యతో ప్రశాంతంగా సమయం గడపగలుగుతానని డాన్ ఆనందం వ్యక్తం చేశాడు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *