“8వ తరగతి పాసైతే చాలు!” – ఇండియా పోస్ట్‌లో భారీ జీతంతో అదిరిపోయే ఉద్యోగాలు.. దరఖాస్తుకు సమీపిస్తున్న చివరి తేదీ

భారత తపాలా శాఖ (ఇండియా పోస్ట్)లోని కోల్‌కతా మెయిల్ మోటార్ సర్వీసెస్ విభాగంలో ఖాళీగా ఉన్న స్కిల్డ్ ఆర్టిసన్, ట్రేడ్స్‌మన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 8వ తరగతి ఉత్తీర్ణులై, సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం కలిగి ఉండాలి. లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ పొంది ఉండాలి. మోటార్ మెకానిక్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారికి హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.

అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 19,900 నుంచి రూ. 63,200 వరకు వేతనం అందిస్తారు.

ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు తపాలా శాఖ అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకుని పూరించాలి. దానికి అవసరమైన ధ్రువపత్రాల నకళ్లను జతచేసి, ఈ నెల నవంబర్ 30లోపు పోస్టు ద్వారా పంపాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

పూర్తి చేసిన దరఖాస్తులను “The Senior Manager, Mail Motor Services, 139, Beleghata Road, Kolkata – 700015” అనే చిరునామాకు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *