ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘హ్యారీ పాటర్’ కొత్త టెలివిజన్ సిరీస్, రాబోయే క్రిస్మస్ రోజైన డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ప్రముఖ రచయిత్రి జె.కె. రౌలింగ్ రాసిన మొదటి నవల ‘హ్యారీ పాటర్ అండ్ ది ఫిలాసఫర్స్ స్టోన్’ కథ ఆధారంగా ఈ సిరీస్ మొదటి సీజన్‌ను అత్యంత భారీ స్థాయిలో (గ్రాండ్‌గా) రూపొందించారు.
మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్న ఈ మొదటి సీజన్ రిలీజ్ షెడ్యూల్‌ను కూడా ఇప్పుడు విడుదల చేశారు. దీని ప్రకారం, మొదటి ఎపిసోడ్ 2026 డిసెంబర్ 25న విడుదల కానుండగా.. ఆ తర్వాత 2027 జనవరి 3, 10, 17, 24, 31 తేదీల్లో తదుపరి ఎపిసోడ్లు విడుదల కానున్నాయి.
అలాగే, ఈ సిరీస్ ఏడవ ఎపిసోడ్ 2027 ఫిబ్రవరి 7న, చివరిదైన ఎనిమిదవ ఎపిసోడ్ వాలెంటైన్స్ డే అయిన ఫిబ్రవరి 14న విడుదల కానున్నాయని తెలిపారు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అభిమానులకు క్రిస్మస్ పండుగ నుంచి ఫిబ్రవరి నెల వరకు ప్రతి వారం పండుగ వాతావరణాన్ని పంచేలా ఈ రిలీజ్ ప్లాన్ ఉండటంతో ఇంటర్నెట్లో ఈ వార్త వైరల్‌గా మారింది.

Leave a Reply