కార్వార్: తండ్రి చేసిన అప్పులకు బదులుగా 10 ఏళ్ల బాలికపై ఒక వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన నీచమైన సంఘటన ఉత్తర కన్నడ జిల్లాలోని సిర్సిలో జరిగింది.
బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిర్సి గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
మతిన్ అనే వ్యక్తి 10 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు.
బాలిక తండ్రి సంఘం నుండి తీసుకున్న అప్పును తిరిగి చెల్లించకుండా తప్పించుకుంటున్నాడట. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమని అడగడానికి నిందితుడు మతిన్ బాలిక ఇంటి వద్దకు వెళ్ళాడు. ఈ సమయంలో బాలిక తండ్రి ఇంట్లో లేడు. బాలిక ఒక్కతే ఇంటి ఆవరణలో ఆడుకుంటోంది. బాలికను తండ్రి ఎక్కడ ఉన్నాడని అడిగాడు. అతను ఇంట్లో లేడని బాలిక చెప్పింది. ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన నిందితుడు, బాలికను బలవంతంగా లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు అని అంటున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత బాలిక తన తల్లికి విషయం చెప్పగా, బాలిక తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
