మానవులకు అత్యంత భయం కలిగించే సరీసృపం పాములు. చాలా ప్రాంతాలలో పాముల ఉనికి ఉంది.
మనం అత్యంత సురక్షితమని భావించే ఇంట్లోకి కూడా ఇవి వస్తాయి. చాలాసార్లు ఇవి ఇంట్లో దాగి ఉంటే, వాటిని గుర్తించడం కష్టం. ఇది ఇంట్లో నివసించే వారి ప్రాణాలకు కూడా ప్రమాదం. అయితే, ఇంట్లో పాము దాగి ఉందో లేదో కొన్ని విషయాలను గమనించి మనం తెలుసుకోవచ్చు.
దానిలో ఒకటి వాసన (Smell). ఇంట్లో అకస్మాత్తుగా దోసకాయ (Cucumber) వాసన వస్తే, అది కాపర్హెడ్ జాతికి చెందిన పాము ఇంట్లో ఉన్నట్లు సూచన. పాములు భయపడినప్పుడు లేదా ఆత్మరక్షణ చేసుకుంటున్నప్పుడు ఒక ప్రత్యేక వాసనను విడుదల చేస్తాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇంటి లోపల లేదా వెలుపల పాము యొక్క కుబుసం (Shedded Skin) కనిపించినా, పాము సమీపంలో ఉందని అర్థం చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఎలుకల బాధ అకస్మాత్తుగా తగ్గితే, అక్కడ పాము ఉనికి ఉందని అర్థం చేసుకోండి.
ఆహారం, ఆవాసం (Habitat) కోసం పాములు తరచుగా ఇళ్లలోకి మరియు పరిసరాలలోకి వస్తుంటాయి. అందువల్ల, ఇంటి పరిసరాల్లో ఉంచే పూల కుండీలు లేదా కట్టెలను అవి నివాసాలుగా మార్చుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇంటి వెనుక భాగంలో కట్టెలు, పాత దుంగలు పోగుచేస్తే వాటి మధ్య నివసించడానికి పాములు ఇష్టపడతాయి. ఈ విధంగా కట్టెల మధ్య దాక్కోవడం వాటికి చాలా సులభం. అలా ఉంటే, వాటిని వెంటనే తొలగించడం మంచిది. లేదంటే అది మీ ప్రాణాలకు కూడా ముప్పుగా మారవచ్చు.
