పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) రెండు సంవత్సరాలకు పైగా రావల్పిండిలోని అడియాలా జైలులో బందీగా ఉన్నారు. అయితే, ఆయనపై అకస్మాత్తుగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చ మొదలైంది. జైలు లోపలే ఆయన హత్య చేయబడ్డారని వదంతులు వ్యాపించాయి! అయితే, ఇప్పటి వరకు ఏ విశ్వసనీయ వార్తా సంస్థ కూడా ఈ వార్తను అధికారికంగా ధృవీకరించలేదు.
- ‘ఆఫ్ఘన్ టైమ్స్’ అనే ఎక్స్ (గతంలో ట్విట్టర్) హ్యాండిల్ ద్వారా మొదట ఇమ్రాన్ మరణించినట్లు ప్రచారం చేయబడింది. ఆ తర్వాత మరికొన్ని వర్గాల నుంచి ఈ వదంతులు మరింత బలపడ్డాయి.
- ఇటువంటి ప్రచారానికి ప్రధాన కారణాలు— జైలు లోపల ఇమ్రాన్ ఖాన్ను కుటుంబ సభ్యులతో కలవకుండా నిరోధించడం మరియు ఆయన్ను ఇతర ఖైదీల నుండి ఒంటరిగా (సెపరేట్ సెల్) ఉంచడం.
కుటుంబ సభ్యులకు అనుమతి నిరాకరణ, నిరసన
గత వారం ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరీమణులు— ఆలేమా ఖాన్, ఉజ్మా ఖాన్, నౌరీన్ ఖాన్— వారపు సమావేశం కోసం జైలుకు వెళ్లినప్పటికీ, వారికి తమ సోదరుడిని కలవడానికి అనుమతి లభించలేదు.
- దీంతో వారు జైలు బయట ఏకంగా 10 గంటల పాటు ధర్నా చేశారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో ఉద్రిక్తతకు దారితీసింది. నిరసన సమయంలో తమపై దాడి కూడా జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
- ఈ ఘటన తర్వాతే ఇమ్రాన్ ఖాన్ మృతిపై వదంతులు మరింత పెరిగాయి.
నేడు కూడా జైలు బయట పీటీఐ (PTI) మద్దతుదారులు నిరసన ప్రదర్శనలు చేపట్టినా, ఇమ్రాన్ ఖాన్ను ఎవరినీ కలవడానికి అనుమతించలేదు. దీనితో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.
72 ఏళ్ల ఇమ్రాన్ సోదరీమణులు తమ అన్నయ్యను మూడు వారాలుగా చూడలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీటీఐ అధినేతను అమానవీయ పరిస్థితులలో ఒంటరి జైలులో ఉంచారని ఆయన కుటుంబ సభ్యులు మొదటి నుంచీ ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ బహుమతుల విక్రయం సహా ఇతర అవినీతి కేసులలో ఇమ్రాన్ ఖాన్ రెండేళ్లకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితుల నడుమ ఆయన మరణంపై వదంతులు శిఖరానికి చేరడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది.
