19 ఏళ్ల యువతి కవల పిల్లలకు జన్మనివ్వగా, DNA పరీక్షలో ఒక అరుదైన విషయం వెల్లడైంది. ఈ ఇద్దరు పిల్లలకు తల్లి ఒక్కరే అయినప్పటికీ, వారికి వేర్వేరు తండ్రులు ఉన్నట్లు కనుగొనబడింది.
హెటెరోపిటర్నల్ సూపర్‌ఫెకండేషన్
ఒకే రోజులో, కొన్ని గంటల వ్యవధిలో ఇద్దరు వేర్వేరు వ్యక్తులతో శారీరక సంబంధం పెట్టుకోవడం వల్లే ఈ అరుదైన పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది.
ఈ ప్రక్రియలో, మహిళ శరీరం ఒకే సమయంలో రెండు అండాలను (Ova) విడుదల చేసింది. రెండు అండాలు వేర్వేరు పురుషుల వీర్యంతో ఫలదీకరణం (Fertilization) చెందాయి. దీని కారణంగా, కవలలు జన్మించినప్పటికీ, వారి తండ్రులు వేర్వేరు అయ్యారు.
వైద్య చరిత్రలో ఇది చాలా అరుదైన పరిస్థితి. దీనిని ‘హెటెరోపిటర్నల్ సూపర్‌ఫెకండేషన్’ (Heteropaternal Superfecundation) అని అంటారు. ఈ సంఘటన 2022 లో బ్రెజిల్‌లోని గోయాస్ రాష్ట్రంలోని మినైరోస్ నగరంలో జరిగింది.
