బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో భారీ అంచనాలతో వస్తున్న ‘అఖండ 2’ విడుదల వాయిదా పడింది. గత కొన్ని గంటలుగా సినిమా రిలీజ్‌పై అనుమానాలు వ్యక్తమవుతుండగా… చివరకు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధికారికంగా స్పష్టం చేసింది.
అసలే ఈనెల డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేశారు. గురువారం రాత్రి జరగాల్సిన ప్రీమియర్ షోలు కూడా అకస్మాత్తుగా రద్దు కావడంతో సందేహాలు మరింత పెరిగాయి. తాజాగా నిర్మాణ సంస్థ ప్రకటిస్తూ—
“అనివార్య కారణాల వల్ల ‘అఖండ 2’ నిర్ణయించిన తేదీన విడుదల కావడం లేదు. అభిమానులకు, సినీ ప్రేక్షకులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాము. మీ మద్దతు అవసరం. త్వరలో కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాము.”
అని తెలిపింది.
అంటే… పెద్ద ఎత్తున జరగాల్సిన అఖండ 2 రీలీజ్‌కు తాత్కాలిక బ్రేక్ పడినట్టే. ఇప్పుడు అందరి దృష్టి — కొత్త రిలీజ్ డేట్‌పై!
