“ఛీ! ఇంత నీచంగా ప్రవర్తిస్తారా?” కట్నం దక్కలేదన్న కోపం.. భార్య వ్యక్తిగత వీడియోను ప్రచారం చేసిన భర్త.. షాకింగ్ ఘటన..!!

మధ్యప్రదేశ్‌లోని రీవా జిల్లాలో, కట్నం దక్కలేదన్న కోపంతో ఒక భర్త, భార్యతో సన్నిహితంగా ఉన్న వ్యక్తిగత క్షణాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేసిన సంఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

పెళ్లికి ముందే కట్నం కోసం ఒత్తిడి చేశారని, పెళ్లి తర్వాత కూడా భర్త మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టి, బలవంతంగా లైంగిక సంబంధానికి వప్పించాడని బాధితురాలైన ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.

భర్త తన అనుమతి లేకుండా రికార్డ్ చేసిన వ్యక్తిగత వీడియోలను ఉద్దేశపూర్వకంగానే ప్రచారం చేయడంతో, మానసిక వేదనకు గురైన ఆమె, భర్త మరియు అత్తమామల కుటుంబ సభ్యులపై కట్నం వేధింపులు, బెదిరింపులు మరియు వ్యక్తిగత సమాచారాన్ని ప్రచారం చేయడం వంటి సెక్షన్ల కింద ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, వీడియోను పరిశీలించి, భర్తపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.


Posted

in

by

Tags: