ప్రియుడు కారులో సెక్స్ చేయాలనే కోరికను వ్యక్తం చేశాడు, అడిగినప్పుడు తన బట్టలన్నీ తీసేసింది, ఆపై తన నగ్న శరీరంతో ఇంతకు ముందు ఎప్పుడూ చేయని పని చేసాడు…

సంబంధాలు, నమ్మకద్రోహం మరియు క్రూరత్వానికి సంబంధించిన ఒక భయంకరమైన ఉదంతం ఉత్తరప్రదేశ్ మరియు హర్యానా రాష్ట్రాలను వణికించింది. సహారన్‌పూర్‌కు చెందిన ఉమా అనే యువతిని ఆమెతో సహజీవనం (Live-in) చేస్తున్న బిలాల్ అనే వ్యక్తి అత్యంత కిరాతకంగా చంపి, గుర్తు పట్టకుండా తల నరికి పారేశాడు. విచిత్రమేమిటంటే, నిందితుడు బిలాల్‌ను తన పెళ్లి రోజే పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రేమ పేరుతో మృత్యువు వల: బిలాల్ వృత్తిరీత్యా టాక్సీ డ్రైవర్. గత రెండేళ్లుగా ఉమాతో కలిసి సహజీవనం చేస్తున్నాడు. బిలాల్‌కు వేరే చోట పెళ్లి నిశ్చయమవడంతో ఉమాను వదిలించుకోవాలని ప్లాన్ వేశాడు. కానీ, ఉమా మాత్రం తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోంది. డిసెంబర్ 6న బిలాల్ ఆమెను కారులో షికారుకు తీసుకెళ్లాడు. సుమారు 6 గంటల పాటు తిప్పిన తర్వాత హర్యానా-హిమాచల్ సరిహద్దులోని పాంటా సాహిబ్ సమీపానికి చేరుకున్నాడు.

కారులోనే బిలాల్ తన శృంగార వాంఛను వ్యక్తపరిచాడు. ఉమా తన దుస్తులను తొలగించగానే, బిలాల్ వెనుక సీట్లోకి వెళ్లి బెల్టుతో ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత మాంసం కోసే కత్తితో ఆమె తల నరికి పారేశాడు. ఆమె నగ్న శరీరాన్ని ప్రతాప్‌నగర్ అడవుల్లో పడేసి, గుర్తు పట్టకుండా తలని వేరే చోట దాచిపెట్టాడు.

ఉమా గత జీవితం – పెళ్లి రోజే ప్రియుడితో పరార్: ఉమా జీవితం మొదటి నుంచీ ఒక సినిమా కథలాగే ఎన్నో మలుపులతో సాగింది. 15 ఏళ్ల క్రితం తన పెళ్లి రోజే, మెహందీ చేతులతోనే తన ప్రియుడు జాలీతో కలిసి పారిపోయింది. ఎవరి కోసం అయితే కుటుంబాన్ని వదిలేసిందో, ఆ జాలీకి 13 ఏళ్ల తర్వాత విడాకులు ఇచ్చేసింది. తన బిడ్డ కూడా తనకు వద్దని కోర్టులో చెప్పేసింది. భర్తను వదిలేసిన తర్వాత బిలాల్‌తో సహజీవనం మొదలుపెట్టింది, కానీ అదే ఆమె మరణానికి దారితీసింది.

తండ్రి వేదన: 15 ఏళ్ల క్రితమే ఉమా తమకు దూరమైందని ఆమె కుటుంబ సభ్యులు భావించారు. పోలీసులు ఈ హత్య గురించి సమాచారం ఇవ్వడంతో వారు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఉమా తండ్రి తన కూతురిని గుర్తించడానికి వెళ్తే.. అక్కడ ఆయనకు కనిపించింది శరీరం కాదు, కేవలం ఆమె తెగిపడిన తల మాత్రమే. 15 ఏళ్ల తర్వాత తండ్రి కూతుళ్ల కలయిక ఇంత విషాదంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు.

పెళ్లి పీటల నుండి జైలుకు: హత్య చేసిన తర్వాత బిలాల్ ఏమీ ఎరగనట్టు సహారన్‌పూర్ వచ్చి తన పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యాడు. పోలీసులకు దొరకనని భావించాడు. కానీ, పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి, సరిగ్గా పెళ్లి రోజే అతడిని అరెస్ట్ చేశారు. బిలాల్ ఇచ్చిన సమాచారం మేరకే పోలీసులు ఉమా తలని స్వాధీనం చేసుకున్నారు.


Posted

in

by

Tags: