మెట్రో స్టేషన్ బయట భిక్షాటన చేస్తున్న స్టార్ క్రికెటర్ భార్య! సిక్సర్ కింగ్ అని పేరుగాంచిన వ్యక్తి భార్యకు ఒక పూట భోజనానికి కూడా వేడుకోవాల్సిన పరిస్థితి..

ఫ్యాక్ట్ చెక్: ముంబైలోని బేలాపూర్ మెట్రో స్టేషన్ బయట ఒక వృద్ధురాలు భిక్షాటన చేస్తూ కనిపించారు. కొందరు ఆమెను ఒక ఆశ్రయ కేంద్రానికి తీసుకువెళ్లి, స్నానం చేయించి, కొత్త బట్టలు ఇచ్చారు. ఆ తర్వాత ఆమె పేరు, భర్త పేరు అడగగా.. ఆమె ఇచ్చిన సమాధానం విని అందరూ షాక్ అయ్యారు. ఆ మహిళ తన పేరు రేఖా శ్రీవాస్తవ అని, తాను మాజీ క్రికెటర్ సలీం దురానీ భార్యనని చెప్పుకున్నారు.

ఆమె చెప్పిన దాని ప్రకారం, ఆమె తన జీవితంలో సగానికి పైగా ముంబైలోనే గడిపారు. కొన్ని ఏళ్ల పాటు దుబాయ్‌లో నివసించారు మరియు ఒక ఎయిర్‌లైన్స్ సంస్థకు యజమానిగా ఉండేవారు. ఆ తర్వాత క్రికెటర్ సలీం దురానీని వివాహం చేసుకున్నారు. దురానీ రెండేళ్ల క్రితం మరణించారని, ఆ తర్వాతే తాను వీధుల పాలయ్యానని ఆమె వాపోయారు.

రేఖా శ్రీవాస్తవ తాను సలీం దురానీని పెళ్లి చేసుకోవడమే కాకుండా, అతనితో కలిసి అనేక ప్రాంతాలకు వెళ్లానని, ప్రతి మ్యాచ్‌కు హాజరయ్యేదాన్నని తెలిపారు. ఆ సమయంలో తాను ఎందరో రాజులు, మహారాజులను, ముఖ్యంగా గుజరాత్ మహారాజును కలిసినట్లు పేర్కొన్నారు.

ఆమె మాటల ప్రకారం, దుబాయ్‌లో ఉన్నప్పుడు సకల సంపదలతో విలాసవంతమైన జీవితం గడిపారు. కానీ ఒక దురదృష్టకర సంఘటన వల్ల జీవితం తలకిందులై, ఆర్థికంగా చితికిపోయి నిరాశ్రయులయ్యారు.

ప్రస్తుతం సలీం దురానీ కుటుంబం జామ్‌నగర్‌లో నివసిస్తోంది. ఈ మహిళ గురించి వారి నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సలీం దురానీకి సంబంధించిన ఏ విషయాల్లోనూ రేఖా శ్రీవాస్తవ పేరు ఎప్పుడూ వినిపించలేదు. సలీం దురానీ ఏప్రిల్ 2, 2023న జామ్‌నగర్‌లో తన సోదరుడి వద్ద ఉన్నప్పుడే కన్నుమూశారు.


Posted

in

by

Tags: