సౌదీలో మంచు వర్షం: ప్రపంచ అంతం దగ్గర పడిందా? ముహమ్మద్ ప్రవక్త ‘ఆ’ భవిష్యవాణి నిజమవుతోందా!

సౌదీ అరేబియా అంటే మనకు గుర్తుకు వచ్చేది అంతులేని ఎడారి మరియు మండే ఎండలు. కానీ ఇప్పుడు అక్కడ చిత్రం పూర్తిగా మారిపోయింది. ఉత్తర సౌదీ అరేబియాలోని తాబుక్ (Tabuk) మరియు అల్-జౌఫ్ ప్రాంంతాల్లో రికార్డు స్థాయిలో మంచు కురవడంతో ఎడారి ప్రాంతమంతా తెల్లటి దుప్పటి కప్పుకున్నట్లుగా మారిపోయింది. ఈ దృశ్యాలను చూసి చాలామంది ఇవి ‘ఏఐ’ (AI) సృష్టించిన చిత్రాలని భ్రమపడుతున్నారు.

ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల కంటే తక్కువగా..

సౌదీ వాతావరణ శాఖ సమాచారం ప్రకారం, ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 4 (-4) డిగ్రీల కంటే దిగువకు పడిపోయాయి. కేవలం మంచు మాత్రమే కాకుండా, కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎడారిలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ తేమ కారణంగా ఎడారిలో పచ్చని గడ్డి మొలుస్తోంది. ఇది చూస్తుంటే ఎడారి కాస్తా పచ్చని మైదానంగా మారుతున్నట్లు అనిపిస్తోంది.

ముహమ్మద్ ప్రవక్త భవిష్యవాణి ఏమిటి?

సోషల్ మీడియాలో ఈ మంచు వర్షాన్ని ఇస్లాం మత ప్రవక్త ముహమ్మద్ చెప్పిన భవిష్యవాణితో ముడిపెడుతున్నారు. ఒక ‘హదీస్’ (సహీ ముస్లిం) ప్రకారం, ప్రవక్త ఇలా అన్నారు:

“అరేబియా ద్వీపకల్పం మళ్లీ పచ్చిక బయళ్ళు మరియు నదులతో నిండిపోయే వరకు ‘ఖయామత్’ (ప్రపంచ అంతం) రాదు.”

సౌదీలో కురుస్తున్న వర్షాలు, మంచు మరియు దాని వల్ల పెరుగుతున్న పచ్చదనం ఈ భవిష్యవాణి నిజమయ్యే దిశగా అడుగులని చాలామంది భావిస్తున్నారు. ప్రకృతిలో వస్తున్న ఈ మార్పులు అంతిమ కాలానికి సంకేతమని వారు నమ్ముతున్నారు.

శాస్త్రవేత్తల అభిప్రాయం:

మరోవైపు, వాతావరణ నిపుణులు దీనిని ప్రపంచ వాతావరణ మార్పు (Global Climate Change) ఫలితంగా చూస్తున్నారు. మధ్యధరా సముద్రం నుండి వచ్చే చల్లని గాలులు, తక్కువ పీడన ప్రభావం వల్ల ఈ అసాధారణ మంచు వర్షం కురుస్తోందని వారు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే, సౌదీ అరేబియా వ్యవసాయ రంగం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.


Posted

in

by

Tags: