తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి కూతురు బరితెగింపు! మద్యం, విచ్చలవిడి శృంగారం.. రూ. 20 లక్షల బంగారం ఎత్తుకెళ్లిన స్నేహితులు

కోల్‌కతా: ఒక వ్యాపారవేత్త తన భార్యతో కలిసి మూడు రోజుల పాటు ఊరికి వెళ్లగా, ఆ సమయాన్ని అదనుగా తీసుకున్న అతని 23 ఏళ్ల కుమార్తె తన ఇంట్లోనే విచ్చలవిడి పార్టీలు చేసుకుంది. స్నేహితులను పిలిపించి మద్యం సేవించడమే కాకుండా, అశ్లీల కార్యకలాపాలకు పాల్పడింది. ఈ పార్టీకి వచ్చిన స్నేహితులే ఆ ఇంట్లోని బీరువా పగులగొట్టి దాదాపు 15 తులాల బంగారాన్ని అపహరించారు.

అసలేం జరిగింది? దక్షిణ దమ్ దమ్ ప్రాంతానికి చెందిన ఇటుక బట్టీల యజమాని త్రిదిబ్ ఘోష్ (పేరు మార్చబడింది), గత నవంబర్ 7న తన భార్యతో కలిసి బసిర్‌హట్‌లోని తన పూర్వీకుల ఇంటికి వెళ్లారు. మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చి చూసేసరికి బీరువాలోని రూ. 20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 10 వేల నగదు మాయమయ్యాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇన్‌స్టాగ్రామ్ స్నేహితులు.. గ్రూప్ సెక్స్.. తల్లిదండ్రులు ఊరికి వెళ్తున్నారని ముందే తెలుసుకున్న కూతురు, పార్టీ కోసం పక్కా ప్లాన్ వేసింది. తన స్నేహితురాలు ఒకరిని ఇంటికి పిలిపించుకుని, ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన పలువురు యువకులను ఇంటికి ఆహ్వానించింది. పోలీసులు సేకరించిన ఆధారాల ప్రకారం.. ఆ మూడు రోజులు వారు ఖరీదైన మద్యం సేవించారు. అంతేకాకుండా గర్భనిరోధక మాత్రలు కొనుగోలు చేసినట్లు కూడా సీసీటీవీ ఫుటేజీలో తేలింది. ఇద్దరు యువతులు మరియు నలుగురు యువకులు కలిసి ఆ మూడు రోజులు ‘గ్రూప్ సెక్స్’లో మునిగితేలారు.

నిందితుల అరెస్ట్: ఈ పార్టీకి వచ్చిన యువకులను విచారించగా, ఎక్బాల్‌పూర్ ప్రాంతానికి చెందిన సిద్ధాంత్ థాపా, జైన్ ఖాన్ అనే ఇద్దరు యువకులు దొంగతనానికి పాల్పడినట్లు తేలింది. వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల జీవనశైలి చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. నిందితుడు సిద్ధాంత్ తల్లి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ నెలకు రూ. 8 వేలు సంపాదిస్తుంటే, అతను మాత్రం రూ. 1.30 లక్షల ఐఫోన్ వాడుతున్నాడు. దొంగిలించిన బంగారాన్ని అమ్మి వచ్చిన డబ్బుతో నిందితులు హుక్కా సెంటర్లు, సింగింగ్ బార్లలో విచ్చలవిడి ఖర్చు చేసినట్లు విచారణలో తేలింది.


Posted

in

by

Tags: