బంగ్లాదేశీయులు ఇకపై భారత్‌కు రావడం కష్టం! అహంకారపు మాటలకు భారత్ ‘చెక్’.. రాయబారిని పిలిచి హెచ్చరిక.

ఢిల్లీ: భారతదేశంలోని ‘ఏడు సోదరి రాష్ట్రాలు’ (Seven Sisters) అని పిలవబడే ఈశాన్య రాష్ట్రాలను విడదీస్తామంటూ బంగ్లాదేశ్ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. బంగ్లాదేశ్ రాయబారికి సమన్లు జారీ చేసి, పిలిపించి గట్టిగా హెచ్చరించింది. దీనితో పాటు ఢాకాలో ఉన్న మూడు భారత వీసా దరఖాస్తు కేంద్రాలను మూసివేయడం బంగ్లాదేశ్ ప్రజల్లో కలకలం రేపుతోంది.

నేపథ్యం: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, అక్కడ మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వీరు భారత్‌కు వ్యతిరేక వైఖరిని అవలంబిస్తూ, పాకిస్థాన్‌తో చేతులు కలిపి భారత్‌ను రెచ్చగొడుతున్నారు. అక్కడ మైనారిటీలైన హిందువులపై దాడులు కూడా పెరుగుతున్నాయి.

హస్నాత్ అబ్దుల్లా హెచ్చరిక: బంగ్లాదేశ్ నేషనల్ పీపుల్స్ పార్టీ సీనియర్ నేత హస్నాత్ అబ్దుల్లా భారత్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. “భారత శత్రువులకు మా దేశంలో ఆశ్రయం ఇస్తాము. భారత్‌ను విడదీయాలని చూసే వేర్పాటువాదులకు మద్దతు ఇస్తాము. భారతదేశంలోని ఏడు సోదరి రాష్ట్రాలను విడదీస్తాము” అంటూ మినహాయింపు లేకుండా బెదిరింపులకు దిగారు.

భారత్ స్పందన: ఈ విద్వేషపూరిత ప్రసంగంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబారి రియాజ్ హమీదుల్లాను పిలిపించి, బంగ్లాదేశ్‌లో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది. ఢాకాలోని భారత రాయబార కార్యాలయం చుట్టూ భద్రతను పెంచాలని డిమాండ్ చేసింది. ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు ద్వైపాక్షిక సంబంధాలను బలహీనపరుస్తాయని భారత్ హెచ్చరించింది.

వీసా కేంద్రాల మూసివేత: భారత్ తన మొదటి చర్యగా, ఢాకాలోని జమునా ఫ్యూచర్ పార్క్‌లో ఉన్న భారత వీసా దరఖాస్తు కేంద్రాన్ని (IVAC) భద్రతా కారణాల దృష్ట్యా మూసివేసింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది బంగ్లాదేశీయులు చికిత్స కోసం, పర్యాటకం కోసం భారత్‌కు వస్తుంటారు. ఇప్పుడు ఈ కేంద్రం మూతపడటంతో వీసా పొందడం బంగ్లాదేశ్ ప్రజలకు పెను సవాలుగా మారింది.


Posted

in

by

Tags: