తక్కువ ఖర్చుతో థాయ్‌లాండ్ టూర్! కుటుంబంతో వెళ్లడానికి సరైన అవకాశం.. IRCTC ప్యాకేజీ వివరాలు ఇవే!

చాలామంది ఏడాదికి ఒక్కసారైనా విదేశీ పర్యటనకు వెళ్లాలని కోరుకుంటారు. కానీ, భారీ ఖర్చులను చూసి ఆ ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటారు. సామాన్య ప్రజలకు కూడా విదేశీ యాత్రలను అందుబాటులోకి తెచ్చేందుకు ఐఆర్‌సీటీసీ (IRCTC) ఎప్పటికప్పుడు ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిస్తోంది. ఈ క్రమంలోనే న్యూ ఇయర్ సందర్భంగా థాయ్‌లాండ్ టూర్ ప్యాకేజీని పరిచయం చేసింది.

థాయ్‌లాండ్ టూర్ వివరాలు: IRCTC థాయ్‌లాండ్ పర్యటన డిసెంబర్ 31న ప్రారంభమై జనవరి 4న ముగుస్తుంది. అంటే మొత్తం 5 రోజుల పాటు మీరు థాయ్‌లాండ్‌ను చుట్టి రావచ్చు.

  • డిసెంబర్ 31: చెన్నై నుండి బ్యాంకాక్ చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో పట్టాయాకు వెళ్తారు. అక్కడే న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని రాత్రి హోటల్‌లో బస చేస్తారు.
  • జనవరి 1: ఉదయం కోరల్ ఐలాండ్ (Coral Island) సందర్శన. సాయంత్రం అల్కాజర్ షో (Alcazar Show) చూసి రాత్రికి హోటల్‌లో బస చేస్తారు.
  • జనవరి 2: పట్టాయా నుండి బయలుదేరి బ్యాంకాక్ చేరుకుంటారు. అక్కడ ప్రసిద్ధ బుద్ధ దేవాలయాలు, చావో ప్రయా నది (Chao Phraya River) వంటి ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు.
  • జనవరి 4: బ్యాంకాక్‌లో పర్యటన ముగించుకుని సాయంత్రం 6 గంటల విమానంలో తిరిగి చెన్నై చేరుకుంటారు.

ప్యాకేజీలో ఏమేమి ఉంటాయి? ఈ టూర్ ప్యాకేజీలో విమాన టికెట్లు, 3 రోజుల బస, రోజూ ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం మరియు రోజుకు రెండు వాటర్ బాటిళ్లు వంటి వసతులను IRCTC కల్పిస్తుంది.

ధర ఎంత? (Fare Details): ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ధరలను ఈ విధంగా నిర్ణయించారు:

  • ఒక్కరు ప్రయాణిస్తే: రూ. 76,200
  • ఇద్దరు కలిసి ప్రయాణిస్తే (ఒక్కొక్కరికి): రూ. 68,900
  • పిల్లలకు: రూ. 65,500

కేవలం థాయ్‌లాండ్ మాత్రమే కాకుండా, కొత్త సంవత్సరం కోసం సింగపూర్, మలేషియా దేశాలకు కూడా IRCTC ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది.


Posted

in

by

Tags: