సంవత్సరాంతంలో అందరూ వేడుకల్లో మునిగిపోతారు. క్రిస్మస్ మరియు కొత్త సంవత్సరం వేడుకల్లో వైన్ మరియు కేక్ ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆల్కహాల్‌కు దూరంగా ఉండేవారు కూడా ఇంట్లోనే సహజసిద్ధంగా తయారు చేసిన రెడ్ వైన్‌ను ఇష్టపడతారు. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది.
కావలసిన పదార్థాలు:
- ఎర్రటి లేదా నల్లటి ద్రాక్ష – 1.5 కిలోలు
- చక్కెర – 500 గ్రాములు
- ఈస్ట్ (Yeast) – 1 చెంచా
- నీళ్లు – 4 లీటర్లు
- గాజు జార్ (Glass Jar)
- వంట సోడా లేదా నిమ్మరసం
తయారీ విధానం:
- ముందుగా ద్రాక్ష పండ్లను నీటిలో వేసి బాగా కడగాలి. తర్వాత అందులో నిమ్మరసం లేదా వంట సోడా వేసి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. దీనివల్ల ద్రాక్ష పండ్లపై ఉండే మురికి లేదా క్రిములు నశిస్తాయి.
- తర్వాత ద్రాక్ష పండ్లను శుభ్రమైన చేతులతో (చేతి గ్లౌజులు వాడటం మంచిది) బాగా పిసికి రసం తీయాలి.
- ఈ మిశ్రమాన్ని ఒక గాజు జార్‌లోకి తీసుకుని, అందులో చక్కెర మరియు ఈస్ట్ వేసి బాగా కలపాలి.
- సుమారు 10 రోజుల తర్వాత, ఈ రసాన్ని వేరొక గాజు సీసాలోకి వడకట్టుకోవాలి.
- వైన్ మంచి రుచిని సంతరించుకోవాలంటే కనీసం 6 నెలల పాటు నిల్వ చేయాలి. ఆ తర్వాతే అది తాగడానికి సిద్ధమవుతుంది.
