న్యూఢిల్లీ: విడాకుల తర్వాత కూడా భరణం (Alimony) అందలేదన్న కోపంతో ఒక మహిళ తన మాజీ భర్తను కోర్టు హాల్‌లోనే అందరి ముందూ చితకబాదిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్యామిలీ కోర్టు వెలుపల ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
అసలేం జరిగింది? కేసు తుది తీర్పు వెలువడక ముందే సదరు వ్యక్తి తన పేరిట ఉన్న ఆస్తులన్నింటినీ తన తల్లి పేరు మీదకు బదిలీ చేశాడు. దీంతో ఆ వ్యక్తికి ఎలాంటి ఆస్తులు లేవని భావించిన కోర్టు, మహిళ చేసిన భరణం అభ్యర్థనను తిరస్కరించింది. ఈ విషయం తెలుసుకున్న మహిళ తీవ్ర ఆగ్రహానికి లోనైంది. కోర్టు ఆవరణలోనే అందరి ముందు తన భర్తను నెట్టివేసి, చెంపదెబ్బలు కొట్టి తన కోపాన్ని వెళ్లగక్కింది.
‘The Forgotten Man’ అనే ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఈ వీడియో షేర్ చేయబడింది. భరణం దక్కలేదన్న నిరాశలో మహిళ తన భర్తపై దాడి చేసిందని అందులో పేర్కొన్నారు. అక్కడ ఉన్న ఒక స్థానికుడు ఈ దృశ్యాన్ని మొబైల్‌లో బంధించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో భిన్నమైన కామెంట్స్: ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
- “న్యాయస్థానం ఈ వీడియోను పరిగణనలోకి తీసుకుని, దాడికి పాల్పడిన మహిళను శిక్షించాలి” అని ఒకరు కామెంట్ చేశారు.
- “చాలా తెలివైన నిర్ణయం (ఆస్తి బదిలీ చేయడం).. భారతీయ పురుషులందరూ ఇతనిని చూసి నేర్చుకోవాలి” అని మరొకరు రాశారు.
- “ప్లాన్ ఏ ఫెయిల్ అయ్యి, ప్లాన్ బి లేనప్పుడు ఇలాగే జరుగుతుంది” అని ఇంకొకరు ఎద్దేవా చేశారు.
- మరికొందరు మాత్రం, “దీని కోసం ఆమెను జైలులో పెట్టాలి, సమాజం ఇలాంటి హింసను సామాన్యీకరించకూడదు. చట్టంలో సమానత్వం ఎక్కడ ఉంది?” అని ప్రశ్నిస్తున్నారు.
