బావా మరదళ్ల ప్రేమకథ: నడిరోడ్డుపై ఆ స్థితిలో కనిపించిన బావా మరదళ్లు.. చూసి పోలీసులు కూడా షాక్! విషయం తెలిసి కుటుంబ సభ్యులు విస్తుపోయారు

మీరట్: భారతీయ సమాజంలో బావా మరదళ్ల బంధం చాలా ప్రత్యేకమైనది. ఈ బంధం గౌరవం, ఆత్మీయత మరియు మర్యాదలతో కూడి ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఈ బంధం పరిధి దాటి అక్రమ సంబంధాలకు దారితీసిన ఘటనలు వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో బావా మరదళ్లు తీసుకున్న ఒక భయంకరమైన నిర్ణయం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.

వివరాల్లోకి వెళ్తే: మీరట్‌లోని పఠోలి గ్రామానికి చెందిన 19 ఏళ్ల అంశిక మరియు ఆమె బావ, ఘజియాబాద్‌కు చెందిన 32 ఏళ్ల ఆశిష్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ బుధవారం సాయంత్రం ఇళ్ల నుండి పారిపోయారు. నేషనల్ హైవేపై దాద్రి బైపాస్ వద్ద విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు.

రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉన్న వీరిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే వారిని బాదల్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అంశిక మరణించింది. ఆశిష్ పరిస్థితి విషమించడంతో మరో ఆసుపత్రికి తరలించినప్పటికీ, అక్కడ అతను కూడా కన్నుమూశాడు.

కుటుంబ సభ్యుల ఆవేదన: వీరిద్దరూ సోమవారం నుండే ఇళ్ల నుండి కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యులు వీరి కోసం వెతుకుతూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఆశిష్ మొబైల్‌కు కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా, పోలీసులు లిఫ్ట్ చేసి జరిగిన విషయాన్ని చెప్పారు. ఆసుపత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు విగతజీవులుగా పడి ఉన్న వారిని చూసి కన్నీరుమున్నీరయ్యారు.


Posted

in

by

Tags: