ఈ రోజుల్లో కంటెంట్ క్రియేట్ చేసే రేసులో అందరూ పరుగులు తీస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ మైక్ పట్టుకుని ప్రశ్నలు అడగడం, పార్కుల్లో పిల్లలను ఇంటర్వ్యూ చేయడం కామన్ అయిపోయింది. అయితే కొన్నిసార్లు ఈ ప్రయత్నాలు బెడిసికొడుతుంటాయి. తాజాగా ఎక్స్ (X) ప్లాట్ఫామ్లో వైరల్ అవుతున్న ఒక వీడియో ఇందుకు నిదర్శనం. ఒక యువతి పిల్లలను ప్రశ్నలు అడగడానికి వెళ్లగా, వారు ఇచ్చిన ఒకే ఒక్క సమాధానంతో ఆమె అక్కడి నుండి కోపంతో వెళ్ళిపోయింది.
వైరల్ వీడియోలో ఏముంది?
వీడియోలో కనిపించే దాని ప్రకారం.. ఒక యువతి మొబైల్ కెమెరా ఆన్ చేసుకుని, పార్కులో ఆడుకుంటున్న కొంతమంది పిల్లల దగ్గరకు వెళ్తుంది. చాలా కాన్ఫిడెన్స్‌తో పిల్లలను ఒక ప్రశ్న అడుగుతుంది – “మీరు పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నారు?”. పిల్లలు మొదట ఆ ప్రశ్నను వింటారు, కానీ వెంటనే ఒక పిల్లాడు అమాయకత్వంతో తిరుగు ప్రశ్న వేస్తాడు – “ముందు మీరు చెప్పండి, మీరు ఏమవుతారు?”. అప్పుడు ఆ అమ్మాయి నవ్వుతూ “నేను ఇప్పటికే పెద్దదాన్ని అయిపోయాను కదా” అని సమాధానం ఇస్తుంది. అసలు కథ అక్కడే మలుపు తిరుగుతుంది.
ఆ అమ్మాయి అలా అనగానే, ఏమాత్రం ఆలోచించకుండా పిల్లలు మరో ప్రశ్న విసిరారు – “మరి మరి ఇంత పెద్దవారయ్యారు కదా.. ఇంకా ఏమీ అవ్వలేదేంటి?”. ఈ మాట వినగానే అక్కడున్న పిల్లలందరూ పగలబడి నవ్వడం మొదలుపెట్టారు. ఒక్క క్షణం పాటు ఆ యువతికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆమె ముఖంలో నవ్వు మాయమైపోయింది. పిల్లల ప్రశ్నకు సమాధానం చెప్పలేక, అసహనంతో ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈ సీన్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
సోషల్ మీడియాలో నెటిజన్ల రియాక్షన్లు
ఈ వీడియోను X లో @TheBahubali_IND అనే యూజర్ షేర్ చేశారు. దీనికి “అంత పర్సనల్‌గా వెళ్లకూడదు.. పిల్లలు మనసు వెన్న లాంటి వారు. దీదీ భయపడింది.. దీదీ భయపడింది” అనే క్యాప్షన్ ఇచ్చారు.
వీడియో వైరల్ అవ్వగానే నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు:
- “పిల్లలను ప్రశ్న అడగడం ఆమెకు భారమైపోయింది” అని ఒకరు.
- “ఆ ప్రశ్న నేరుగా ఆత్మను తాకింది” అని మరొకరు.
- “పిల్లలకు ఎలాంటి ఫిల్టర్లు ఉండవు, ఏదైనా ముక్కుసూటిగా అడిగేస్తారు” అని ఇంకొకరు కామెంట్ చేశారు.
- “దీదీ వైరల్ అవుదామనుకుంది, కానీ పిల్లల దెబ్బకు ఇలా వైరల్ అయింది” అని కొందరు సెటైర్లు వేస్తున్నారు.
