మైసూర్: KSRTC బస్సులో పిల్లి పిల్లకి కండక్టర్ టికెట్ ఇచ్చిన వింత ఘటన వెలుగులోకి వచ్చింది.
మైసూర్ నుండి మడికేరికి వెళ్లే KSRTC బస్సులో ఒక ప్రయాణీకుడు తనతో పాటు ఒక పిల్లి పిల్లను తీసుకువెళ్తున్నాడు. ఆ సమయంలో కండక్టర్ ఆ పిల్లి పిల్లకు కూడా హాఫ్ టికెట్ (అర టికెట్) ఇచ్చారు.
“అది పిల్లి పిల్ల అయినా, చిన్న పిల్లలైనా సరే హాఫ్ టికెట్ తీసుకోవాల్సిందే” అని కండక్టర్ ఖచ్చితంగా చెప్పినట్లు సమాచారం. దీనిపై సదరు ప్రయాణీకుడు సోషల్ మీడియాలో స్పందిస్తూ.. “ఇప్పుడు పిల్లులకు కూడా క్యాట్ పాస్ తీసుకోవాలా? పోనీ డబ్బులు తీసుకున్నందుకు సీటు ఏమైనా ఇచ్చారా అంటే అదీ లేదు. ఇది న్యాయమేనా?” అని ప్రశ్నించారు. ఈ పోస్ట్‌ను ఆయన రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డికి కూడా ట్యాగ్ చేశారు.
