“Best Action Ever”: ఇప్పటివరకు ఎవరూ చూడని ‘విచిత్రమైన బౌలింగ్’.. స్పిన్నర్ మాయాజాలానికి నెటిజన్లు ఫిదా! వీడియో వైరల్

ఇప్పటివరకు ఎన్నడూ చూడని విధంగా ఒక స్పిన్నర్ చేసిన విచిత్రమైన బౌలింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక బౌలర్ ఎడమచేతి వాటం బౌలర్‌లా పరిగెత్తుకుంటూ వచ్చి, తీరా బంతిని విసిరే సమయంలో కుడిచేతితో బౌలింగ్ చేయడం కనిపిస్తుంది.

ఎక్స్‌ (ట్విట్టర్)లో వైరల్ అయిన ఈ అద్భుతమైన వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ బౌలర్ మొదట ఎడమచేతి వాటం స్పిన్నర్‌లా బంతిని పట్టుకుని రన్-అప్ ప్రారంభిస్తాడు. కానీ అకస్మాత్తుగా బంతిని కుడిచేతిలోకి మార్చుకుని బౌలింగ్ చేస్తాడు. దీనితో అయోమయానికి గురైన బ్యాటర్ క్రీజు వదిలి ముందుకు వచ్చి షాట్ కొట్టబోగా, వికెట్ కీపర్ అతడిని స్టంప్ అవుట్ చేస్తాడు.

చూడటానికి కాస్త తమాషాగా ఉన్న ఈ వింత బౌలింగ్ శైలి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. కొందరు దీనిని “అత్యుత్తమ బౌలింగ్” అని ప్రశంసిస్తున్నారు.

ట్విట్టర్‌లో ఈ వీడియోను షేర్ చేసిన డాక్టర్ ప్రశాంత్ నాయర్ అనే యూజర్.. “తండ్రి అతడిని క్రికెటర్‌ను చేయాలనుకున్నారు, కానీ తల్లి డ్యాన్సర్‌ను చేయాలనుకుంది. బహుశా అందుకే ఇలా చేస్తున్నాడేమో” అని సరదాగా పోస్ట్ చేశారు. అయితే, ఈ ఘటన ఏ మ్యాచ్‌లో జరిగిందనే దానిపై ఖచ్చితమైన సమాచారం ఇంకా తెలియలేదు.


Posted

in

by

Tags: