“పిల్లలు, మహిళలు.. ఇదంతా ఒక పెద్ద సెటప్!” – భిక్షాటన ముఠా గుట్టురట్టు చేసిన విదేశీ పర్యాటకుడు..!!

భారతదేశంలో పర్యటిస్తున్న ఒక అమెరికన్ పర్యాటకుడు ఇక్కడి భిక్షాటన విధానాన్ని ఒక పెద్ద “నెట్‌వర్క్ స్కామ్” (Network Scam) అని విమర్శిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు.

ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. “ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద చంటి పిల్లలను చేతిలో పట్టుకున్న మహిళలు, చిన్న పిల్లలు మరియు ట్రాన్స్‌జెండర్లు ఇలా రకరకాల వ్యక్తులు ఒక ప్రణాళిక ప్రకారం భిక్షాటన చేస్తున్నారు” అని ఆరోపించారు. ముఖ్యంగా విదేశీ పర్యాటకులను చూడగానే ఎక్కువ డబ్బులు అడుగుతూ, వారిని వదలకుండా వెంబడించి ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఇది కేవలం వ్యక్తిగత పేదరికం వల్ల జరుగుతున్నది కాదని, ఒక ముఠాగా ఏర్పడి నిర్వహిస్తున్న మోసపూరిత నెట్‌వర్క్ అని ఆ పర్యాటకుడు మండిపడ్డారు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతిష్టను ఇలాంటి సంఘటనలు దెబ్బతీస్తున్నాయని పేర్కొంటూ, భారత ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ మోసపూరిత నెట్‌వర్క్‌ను అరికట్టాలని ఆయన కోరారు. పర్యాటకుల భద్రత మరియు దేశ గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కూడా డిమాండ్ చేస్తున్నారు.


Posted

in

by

Tags: