కన్నడ నటి నందిని ఆత్మహత్య | ప్రముఖ సీరియల్ నటి నందిని బలవన్మరణం

బెంగళూరు: కన్నడ బుల్లితెరపై తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి నందిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ‘జీవ హూవాగిదె’ (Jiva Hoovagide), ‘సంఘర్ష’ (Sangharsha), ‘నీనాదె నా’ (Neenade Naa) వంటి పాపులర్ సీరియల్స్ ద్వారా ఆమె మంచి పేరు సంపాదించుకున్నారు.

కొట్టూరుకు చెందిన నందిని సి.ఎం. (Nandini CM) పలు సీరియల్స్‌లో సహాయ నటిగా నటించి మెప్పించారు. కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళ సీరియల్స్‌లో కూడా ఆమె నటించారు.

గతంలో ‘గౌరీ’ సీరియల్‌లో విషం తాగే దృశ్యంలో నటించిన నందిని, ఇప్పుడు నిజ జీవితంలో కూడా ఆత్మహత్యకు పాల్పడటం ఆమె అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె మరణంతో కన్నడ చిత్రపరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి.


Posted

in

by

Tags: