భారతదేశ పర్యటనలో ఉన్న పోలాండ్‌కు చెందిన క్లాడియా ఫాలెంటా అనే ట్రావెల్ కంటెంట్ క్రియేటర్, ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తనకు ఎదురైన ఒక భయంకరమైన అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ప్రయాణాల్లో కేవలం సానుకూల అంశాలే కాకుండా, వాస్తవంగా ఎదురయ్యే ఇబ్బందులను కూడా చూపించాలనే ఉద్దేశంతో ఆమె ఈ వీడియోను పోస్ట్ చేశారు.
అసలేం జరిగింది?
ఎనిమిది గంటల రైలు ప్రయాణం తర్వాత క్లాడియా ఉబెర్ క్యాబ్‌లో ఢిల్లీ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడి నుండి వారణాసి వెళ్లే రైలు ఎక్కాల్సి ఉంది. ఆమె స్టేషన్ ప్రవేశ ద్వారం వద్దకు చేరుకోగానే, ఒక వ్యక్తి ఆమెను ఆపి టికెట్ చూపించమని అడిగాడు. ఆమె టికెట్ చూసిన తర్వాత, ఆ టికెట్ చెల్లదని (Invalid), అది నకిలీదని ఆమెను నమ్మించే ప్రయత్నం చేశాడు.
ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి స్టేషన్‌కు దూరంగా ఉన్న ఒక కార్యాలయానికి తనతో రావాలని అతను కోరాడు. కానీ అది ఒక స్కామ్ (Scam) అని క్లాడియా వెంటనే గుర్తించారు.
10 నిమిషాల వాదన:
తన రైలు బయలుదేరడానికి కేవలం 10 నిమిషాల సమయం మాత్రమే ఉండటంతో క్లాడియా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ వ్యక్తితో సుమారు 10 నిమిషాల పాటు వాదించి, తన వద్ద ఉన్న పాత టికెట్లను చూపిస్తూ తన టికెట్ సరైనదేనని గట్టిగా చెప్పారు. చివరకు అతను ఆమెను వదిలిపెట్టాడు. “నేను రైలు మిస్ అయితే, తన దగ్గర టికెట్ కొనేలా చేయడానికే అతను నన్ను సమయం వృధా చేస్తూ ఇబ్బంది పెట్టాడు” అని క్లాడియా పేర్కొన్నారు.
సమయానికి రైలు ఎక్కగలిగారు:
ప్లాట్‌ఫారమ్ మూసివేసి ఉన్న సమయంలో, ఒక అపరిచితుడు హిందీలో మాట్లాడుతూ ఆమెకు సహాయం చేసి వెనుక దారి గుండా స్టేషన్‌లోకి తీసుకెళ్లారు. చివరకు ఆమె సరిగ్గా రైలు కదిలే సమయానికి చేరుకోగలిగారు. ఆ తర్వాత రైలులో ఒక కుటుంబం ఆమెకు పరిచయమై, ఆమెను శాంతింపజేయడంతో తన ప్రయాణాన్ని ప్రశాంతంగా కొనసాగించగలిగారు.
నెటిజన్ల స్పందన:
క్లాడియా సమయస్ఫూర్తిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. “అలాంటి వ్యక్తులతో అసలు మాట్లాడకండి.. మీ పని మీరు చూసుకుని వెళ్ళిపోండి” అని కొందరు సూచించగా, “మోసాన్ని గుర్తించి తప్పించుకున్నందుకు అభినందనలు” అని మరికొందరు కామెంట్ చేశారు.
