ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతమైన దేశంలో ఘోర పేలుడు! 20 మంది మృతి, పలువురికి గాయాలు! కొత్త ఏడాది రోజున విషాదం

బెర్న్: ప్రపంచంలోని అత్యంత ప్రశాంతమైన దేశాలలో ఒకటిగా పరిగణించబడే స్విట్జర్లాండ్‌లో ఒక విలాసవంతమైన రిసార్ట్‌లో భారీ పేలుడు సంభవించింది. అక్కడి ఒక బార్ లో జరిగిన ఈ భయంకరమైన పేలుడులో సుమారు 20 మంది వరకు మరణించి ఉండవచ్చని సమాచారం అందుతోంది.

సాధారణంగా స్విట్జర్లాండ్ ఏ యుద్ధాల్లోనూ పాల్గొనకుండా, తటస్థంగా ఉంటూ ప్రపంచ శాంతికి మారుపేరుగా నిలుస్తుంది. అలాంటి దేశంలో ఈ స్థాయి ఘోర ప్రమాదం జరగడం అంతర్జాతీయంగా దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.

ఘటన వివరాలు:
విలాసవంతమైన స్కీ రిసార్ట్‌లకు (పనిచోట జారే క్రీడలు) ప్రసిద్ధి చెందిన క్రాన్స్-మోంటానా (Crans-Montana) నగరంలో ఈ పేలుడు సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్న సమయంలో, ఒక బార్‌ లోపల ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అక్కడ ఉన్న సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, ఈ పేలుడుకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. గ్యాస్ లీకేజీ వల్ల జరిగిందా లేదా ఇతర కారణాలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags: