జీమెయిల్ వినియోగదారుల చిరకాల కోరికను నెరవేరుస్తూ, ప్రస్తుతం ఉన్న గూగుల్ అకౌంట్‌ను డిలీట్ చేయకుండానే మెయిల్ అడ్రస్‌ను మార్చుకునే వెసులుబాటును గూగుల్ కల్పించింది.
ఈ కొత్త అప్డేట్ విశేషాలు:
- మెయిల్స్ ఆటోమేటిక్ ఫార్వార్డింగ్: మీరు పాత మెయిల్ ఐడీని కొత్త ఐడీగా మార్చినప్పటికీ, మీ పాత అడ్రస్‌కు వచ్చే ఈమెయిల్స్ అన్నీ ఆటోమేటిక్‌గా మీ కొత్త ఇన్బాక్స్కే వస్తాయి.
- డేటా భద్రత: మీ గూగుల్ డ్రైవ్ (Google Drive), గూగుల్ ఫోటోస్ (Google Photos)లో ఉన్న డేటాకు ఎలాంటి నష్టం కలగదు. మీ సమాచారం అంతా సురక్షితంగా ఉంటుంది.
- ఇతర సేవలు: జీమెయిల్ అడ్రస్ మార్చినప్పటికీ యూట్యూబ్, డ్రైవ్ వంటి ఇతర గూగుల్ సేవలను ఉపయోగించడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని గూగుల్ స్పష్టం చేసింది.
గుర్తుంచుకోవలసిన నిబంధన:
ఈ ఫీచర్ ద్వారా ఒకసారి మీ ఈమెయిల్ అడ్రస్‌ను మార్చుకుంటే, తదుపరి ఒక ఏడాది వరకు దానిని మళ్లీ మార్చడానికి లేదా తొలగించడానికి వీలుండదు. అంటే ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ మార్పు చేసుకునే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం ఈ అప్డేట్ దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తోంది.
