రాపిడ్ రైలులో శృంగారం: వైరల్ వీడియో జంటపై కుటుంబ సభ్యుల కీలక నిర్ణయం.. ఇక జీవితాంతం కలిసే ఉండాలి!

గాజియాబాద్: ఢిల్లీ – మీరట్ మధ్య నడిచే రాపిడ్ రైలులో ఒక జంట అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో (CCTV) వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో రెండు కుటుంబాలకు అవమానం జరిగిన నేపథ్యంలో, ఇరు కుటుంబాల పెద్దలు కలిసి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.

వీడియో వైరల్ అయిన తర్వాత వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ, సదరు యువతీ యువకులకు పెద్దలు నిశ్చితార్థం చేశారు. రింగ్ సెర్మనీ (ఉంగరాలు మార్చుకోవడం) పూర్తయిన తర్వాత, అతి త్వరలోనే వీరిద్దరికీ వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా, ఈ ప్రైవేట్ వీడియోను లీక్ చేసిన కంప్యూటర్ ఆపరేటర్‌ను ఇప్పటికే విధుల నుండి తొలగించారు. ప్రస్తుతం ఈ జంటపై మరియు ఆపరేటర్‌పై ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది, దీనిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

అసలేం జరిగింది?

ఢిల్లీ – మీరట్ రాపిడ్ రైలులో అందరూ తలదించుకునేలా ఒక సంఘటన జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో ప్రయాణికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రైలు లోపల ఒక యువకుడు, పాఠశాల విద్యార్థినితో కలిసి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలు రైలులోని సీసీటీవీ (CCTV) కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. రాపిడ్ రైలు భద్రతా బాధ్యతలు SSF చూస్తున్నప్పటికీ, ఇలాంటి ఘటన జరగడం భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది.

స్కూల్ యూనిఫాంలో ఉన్న విద్యార్థిని

వీరిద్దరూ నగరంలోని ఒక ప్రముఖ పాఠశాలకు చెందిన విద్యార్థులని, ఆ యువతి స్కూల్ యూనిఫాంలోనే ఉందని వీడియో ద్వారా స్పష్టమైంది. ఈ వీడియో బయటకు రాగానే ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. బహిరంగ ప్రదేశాల్లో మహిళల గౌరవం మరియు ప్రయాణికుల భద్రతపై తీవ్ర చర్చలు నడిచాయి. చివరకు నిందల నుండి బయటపడటానికి పెద్దలు వీరిద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించారు.


Posted

in

by

Tags: