ఆగ్రా (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఆదివారం సాయంత్రం ఒక హైవోల్టేజ్ డ్రామా చోటుచేసుకుంది. ఒక మహిళ తన భర్తను అతని ప్రియురాలితో కలిసి రోడ్డుపై రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎత్మాద్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుబేర్‌పూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
అసలేం జరిగింది?
వివరాల ప్రకారం.. ఆ వ్యక్తికి కొంతకాలంగా మరో యువతితో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలుసుకున్న భార్య, తన బంధువులతో కలిసి నిఘా పెట్టింది. ఆదివారం సాయంత్రం తన భర్త ఆ యువతితో కలిసి తిరుగుతుండగా ఆమె రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన భార్య, సదరు యువతి జుట్టు పట్టుకుని కిందకు ఈడ్చి, రోడ్డుపైనే చితకబాదింది. ఈ గందరగోళం మధ్య భర్త అక్కడి నుండి తెలివిగా పరారయ్యాడు.
సోషల్ మీడియాలో వైరల్:
రోడ్డుపై ఇద్దరు మహిళలు కొట్టుకోవడాన్ని చూసి భారీగా జనం గుమిగూడారు. కొందరు వ్యక్తులు ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. స్థానికులు వారిని వారించే ప్రయత్నం చేసినప్పటికీ వివాహం సర్దుమణగలేదు.
పోలీసుల రంగప్రవేశం:
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు మహిళలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తన భర్తకు అక్రమ సంబంధం ఉందని, దీనిని ప్రశ్నించినందుకు తనను వేధిస్తున్నాడని, నాలుగు నెలల క్రితమే తనను ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి పంపేశాడని భార్య ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె ఆరోపించింది.
మరోవైపు, దాడికి గురైన యువతి తనపై దాడి చేసిన భార్య మరియు ఆమె బంధువులపై ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు శాంతి, పూజ, ఆర్తి, పింకీ అనే నలుగురు మహిళలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
