ఆరోగ్యవంతులైన యువత ఆకస్మిక మరణాలకు కారణమేమిటి? కొత్త అధ్యయనంలో షాకింగ్ నిజాలు!

ఇటీవలి కాలంలో పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారు కూడా హఠాత్తుగా కుప్పకూలిపోవడం, ఆకస్మికంగా మరణించడం లేదా గుండెపోటుకు గురవ్వడం వంటి వార్తలు మనం తరచుగా వింటున్నాము. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా యువతలో ఈ సమస్య పెరగడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా ఇలాంటి వేల కేసులు నమోదవుతున్నాయి.

కర్ణాటకలోని హాసన్ వంటి ప్రాంతాల్లో ఇలాంటి కేసులు పెరగడంపై గతంలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఈ ఆకస్మిక మరణాలకు అసలు కారణాలేమిటో తెలుసుకోవడానికి నిర్వహించిన తాజా అధ్యయనం కొన్ని కీలక విషయాలను బయటపెట్టింది.

ఆకస్మిక మరణం అంటే ఏమిటి?

వైద్య పరిభాషలో ఆకస్మిక మరణం (Sudden Death) అంటే:

  • లక్షణాలు ప్రారంభమైన ఒక గంటలోపు మరణించడం.
  • లేదా వ్యక్తి చివరగా ప్రాణంతో కనిపించిన 24 గంటల లోపు మరణించడం.
పరిశోధనలో తేలిన ముఖ్య అంశాలు:

ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురితమైన AIIMS నూఢిల్లీ కొత్త అధ్యయనం ప్రకారం, సుమారు 2,214 పోస్ట్‌మార్టం నివేదికలను విశ్లేషించారు. అందులో 180 మరణాలు (8.1%) ఆకస్మిక మరణాల కిందకు వచ్చాయి.

  1. వయస్సు మరియు లింగం: ఆకస్మికంగా మరణించిన వారిలో 57.2% మంది 18 నుండి 45 ఏళ్ల మధ్య వయసు గలవారే. వీరిలో ఎక్కువ మంది పురుషులు కావడం గమనార్హం.
  2. ప్రధాన కారణం (గుండె సమస్యలు): యువతలో సంభవించే ఆకస్మిక మరణాలలో 42.6% గుండె సంబంధిత సమస్యల వల్లే జరుగుతున్నాయి. ముఖ్యంగా గుండెకు రక్తాన్ని చేరవేసే ధమనులు (Arteries) తీవ్రంగా పూడుకుపోవడం లేదా సన్నబడటం వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయి.
  3. శ్వాసకోస సమస్యలు: సుమారు 21.3% మరణాలకు నిమోనియా మరియు క్షయ (TB) వంటి శ్వాసకోస వ్యాధులు కారణమవుతున్నాయి.
  4. వివరించలేని మరణాలు: మరో 21.3% కేసుల్లో పోస్ట్‌మార్టం తర్వాత కూడా మరణానికి గల ఖచ్చితమైన కారణం పత్తా కాలేదు. వీటిని ‘వివరించలేని మరణాలు’గా వర్గీకరించారు.
ఇతర కారకాలు:

కేవలం వైద్యపరమైన కారణాలే కాకుండా, ఆధునిక జీవనశైలి కూడా ఒక కారణంగా మారుతోంది.

  • అధిక మానసిక ఒత్తిడి.
  • పొగత్రాగడం మరియు మద్యపానం.
  • సరైన అవగాహన లేకుండా జిమ్‌లలో చేసే అతివ్యాయామం.

గతంలో ఈ మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్‌తో సంబంధం ఉందని కొన్ని అనుమానాలు వ్యక్తమైనప్పటికీ, తాజా పరిశోధనలో అటువంటి ఆధారాలేవీ లభించలేదు.


Posted

in

by

Tags: