ఫోన్ కవర్‌ను ‘పర్సు’గా మార్చేస్తున్నారా? ఫోన్ వినియోగదారుడికే ప్రమాదం కలిగించే అలవాటు ఇది!

మీ స్మార్ట్‌ఫోన్ కవర్‌లో డబ్బులు, కార్డులు పెడుతున్నారా? అయితే ఇది మీకోసమే!
పర్సు పట్టుకెళ్లడం ఎందుకు, ఫోన్ ఉందిగా! అని చాలామంది తమ మొబైల్ ఫోన్ కవర్‌ను పర్సులా వాడేస్తుంటారు. స్మార్ట్‌ఫోన్ రియర్ ప్యానెల్‌కు (ఫోన్ వెనుక భాగం), కవర్‌కు మధ్యలో కరెన్సీ నోట్లు, ముఖ్యమైన కాగితాలు లేదా బ్యాంక్ కార్డులను భద్రపరుచుకోవడం ఇప్పుడు ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. కానీ, ఇలా చేయడం వల్ల మీరు కేవలం ఫోన్ కవర్‌నే కాదు, ఫోన్‌ను మరియు మీ ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారని మీకు తెలుసా?

మొబైల్ కవర్‌లో వస్తువులను ఉంచడం వల్ల కలిగే నష్టాలు ఇవే:

  1. ఫోన్ పేలిపోయే ప్రమాదం (Overheating):
    ఫోన్‌ను నిరంతరం ఉపయోగించడం వల్ల అది వేడెక్కుతుంది. కొత్త స్మార్ట్‌ఫోన్‌లలో వేడిని తగ్గించడానికి కూలింగ్ సిస్టమ్స్ ఉంటున్నాయి. అయితే, ఫోన్ వెనుక భాగంలో నోట్లు లేదా కాగితాలు పెట్టినప్పుడు, లోపల ఉత్పన్నమయ్యే వేడి బయటకు వెళ్లడానికి మార్గం ఉండదు. దీనివల్ల ఫోన్ విపరీతంగా వేడెక్కి (Overheat), బ్యాటరీ ఉబ్బడం లేదా ఒక్కోసారి ఫోన్ పేలిపోయే అవకాశం కూడా ఉంది.
  2. సిగ్నల్ సమస్యలు (Network Issues):
    చాలా ఫోన్‌ల యాంటెనాలు రియర్ ప్యానెల్ పైభాగంలో అమర్చబడి ఉంటాయి. మీరు కవర్‌లో డబ్బులు లేదా మెటల్ చిప్ ఉన్న బ్యాంక్ కార్డులను ఉంచినప్పుడు, అవి సిగ్నల్‌ను అడ్డుకుంటాయి. దీనివల్ల కాల్ డ్రాప్స్ అవ్వడం లేదా ఇంటర్నెట్ సరిగ్గా అందకపోవడం వంటి సమస్యలు వస్తాయి.
  3. సెన్సార్లు పనిచేయకపోవచ్చు:
    ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదా ఇతర సెన్సార్లు ఉన్నప్పుడు, కవర్‌లో ఉంచిన కాగితాలు వాటి పనితీరును దెబ్బతీస్తాయి.
  4. వైర్‌లెస్ ఛార్జింగ్‌కు ఆటంకం:
    మీ ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంటే, ఫోన్ వెనుక వైపు వస్తువులు ఉండటం వల్ల ఛార్జింగ్ సరిగ్గా అవ్వదు సరికదా, ఛార్జింగ్ సమయంలో వేడి మరింత పెరిగి ఫోన్ పాడయ్యే అవకాశం ఉంది.

Posted

in

by

Tags: