ఆహారం విషయంలో ‘ఆరోగ్యకరమైనది’ మరియు ‘సమతుల్యమైనది’ అనే రెండు పదాలను మనం ఒకేలా భావిస్తాము. కానీ పోషకాహార శాస్త్రం ప్రకారం ఇవి వేర్వేరు. ‘ది హెల్తీ ఇండియన్ ప్రాజెక్ట్’ (THIP) పోషకాహార నిపుణులు గరిమా దేవ్ వర్మన్ దీని గురించి వివరిస్తూ.. ఆరోగ్యకరమైన ఆహారం మీకు అవసరమైన పోషకాలను అందిస్తుంది, అయితే సమతుల్య ఆహారం (Balanced Diet) అన్ని రకాల పోషకాలు సరైన నిష్పత్తిలో అందేలా చూస్తుంది.
చాలామంది ఒకే రకమైన ఆహారంపై దృష్టి పెడతారు లేదా కొన్ని రకాల పోషకాలను పూర్తిగా పక్కన పెడతారు. దీనివల్ల శరీరంలో చక్కెర స్థాయిలు పెరగడం లేదా చెడు కొవ్వు చేరడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే అన్ని రకాల పోషకాలు సరైన మోతాదులో ఉండటమే నిజమైన సమతుల్య ఆహారం.
వారమంతా ఆరోగ్యంగా: 5 అదిరిపోయే టిఫిన్ ఐడియాలు
బెంగళూరులోని ఆస్టర్ సి.ఎం.ఐ ఆసుపత్రి పోషకాహార విభాగం హెడ్ ఎడ్వినా రాజ్, ఆఫీసు లేదా స్కూలుకు తీసుకెళ్లడానికి ఐదు సులభమైన బ్రేక్‌ఫాస్ట్/లంచ్ ఐడియాలను సూచించారు:
- సోమవారం – వెజిటబుల్ ఉప్మా & మొలకల సలాడ్: చిరుధాన్యాలు (మిల్లెట్స్) లేదా రవ్వతో చేసిన వెజిటబుల్ ఉప్మాతో పాటు, నిమ్మరసం, చాట్ మసాలా కలిపిన మొలకల సలాడ్. ఇందులో పీచు పదార్థం (Fiber), ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి.
- మంగళవారం – పప్పు మరియు వెజిటబుల్ ఇడ్లీ: పప్పులు, కూరగాయలు కలిపి చేసిన మెత్తని ఇడ్లీలు. ప్రోటీన్ నిండిన ఈ టిఫిన్‌తో పాటు ఏదైనా ఒక పండు తీసుకుంటే డైట్ పూర్తవుతుంది.
- బుధవారం – శనగల పెరుగు చాట్: ఉడకబెట్టిన శనగలు, పెరుగు మరియు కీరా ముక్కల మిశ్రమం. ఇది పేగు ఆరోగ్యానికి అవసరమైన ప్రోబయోటిక్స్‌ను మరియు రోజంతా కావాల్సిన శక్తిని అందిస్తుంది.
- గురువారం – ఓట్స్ పట్టీలు (కట్లెట్స్) & పండ్లు: ఫైబర్ అధికంగా ఉండే ఓట్స్‌తో చేసిన వడలు లేదా కట్లెట్స్. వీటిని పుదీనా చట్నీ మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే దానిమ్మ వంటి పండ్లతో కలిపి తీసుకోవాలి.
- శుక్రవారం – పన్నీర్ వెజిటబుల్ వ్రాప్ (రోల్): గోధుమ రొట్టెలో వేయించిన పన్నీర్ ముక్కలు, క్యాప్సికమ్ మరియు పెరుగుతో చేసిన రోల్. పని ఒత్తిడి ఎక్కువగా ఉండే శుక్రవారం నాడు ఇది శరీరానికి కావాల్సిన ప్రోటీన్‌ను అందిస్తుంది.
