చాలా ఫోన్లలో వైఫై లేదా బ్లూటూత్ ఆఫ్‌లో ఉన్నప్పటికీ, లోపల ‘స్కానింగ్’ ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండా, కేవలం మీ ఫోన్ సెట్టింగ్స్‌లో మార్పులు చేయడం ద్వారా బ్యాటరీ లైఫ్‌ను గణనీయంగా పెంచుకోవచ్చు.
బ్యాక్‌గ్రౌండ్ స్కానింగ్ వల్ల నష్టమేంటి?
మీరు ఫోన్ వాడకపోయినా, స్క్రీన్ ఆఫ్‌లో ఉన్నా సరే.. వైఫై, బ్లూటూత్ సెన్సార్లు చుట్టుపక్కల నెట్‌వర్క్‌లను వెతుకుతూనే ఉంటాయి. ముఖ్యంగా సిగ్నల్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రక్రియ మరింత వేగంగా జరుగుతుంది. దీనివల్ల:
- బ్యాటరీ వేగంగా ఖర్చవుతుంది.
- ఫోన్ ‘డీప్ స్లీప్ మోడ్’ (Deep Sleep Mode) లోకి వెళ్లదు.
- కొన్నిసార్లు మీకు తెలియకుండానే డేటా కూడా ఖర్చవుతుంది.
ఆండ్రాయిడ్ (Android) ఫోన్లో ఈ సెట్టింగ్స్ ఎలా ఆపాలి?
ఆండ్రాయిడ్ వినియోగదారులు కింద పేర్కొన్న విధంగా చేయండి:
- మొదట ఫోన్ Settings లోకి వెళ్లండి.
- అక్కడ Location ఆప్షన్‌ను ఎంచుకోండి.
- ఆ తర్వాత Location Services పై క్లిక్ చేయండి.
- అక్కడ మీకు WiFi Scanning మరియు Bluetooth Scanning అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.
- వాటిని OFF చేయండి. ఇలా చేయడం వల్ల బ్యాక్‌గ్రౌండ్‌లో అనవసరమైన నెట్వర్క్ సెర్చ్ ఆగిపోతుంది మరియు బ్యాటరీ సేవ్ అవుతుంది.
ఐఫోన్ (iPhone) వినియోగదారులు ఇలా చేయండి:
ఐఫోన్లో కూడా ఈ ప్రక్రియ చాలా సులభం:
- Settings లోకి వెళ్లి Privacy and Security ని ఓపెన్ చేయండి.
- అందులో Location Services పై ట్యాప్ చేయండి.
- కిందకు స్క్రోల్ చేసి System Services లోకి వెళ్లండి.
- అక్కడ Networking and Wireless ఆప్షన్‌ను ఆపేయండి. దీన్ని ఆఫ్ చేసినా మీ వైఫై, బ్లూటూత్ కనెక్షన్లు మామూలుగానే పనిచేస్తాయి. కేవలం బ్యాక్‌గ్రౌండ్ స్కానింగ్ మాత్రమే ఆగుతుంది.
