ఇటీవల ‘X’ (ట్విట్టర్) వేదికగా ఒక ఆసక్తికరమైన వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇద్దరు మహిళలు ఎస్కలేటర్ ఎక్కడానికి వస్తారు. వారిలో ఒకరు ఇప్పటికే ఎస్కలేటర్ ఎక్కగా, మరొక మహిళ మాత్రం కాలు పెట్టడానికి వెనకాడుతూ, కాస్త భయపడుతూ అక్కడే నిలబడిపోతుంది.
ఆ సమయంలో, వెనుక నుంచి వస్తున్న ఒక యువకుడు ఆమె తడబాటును గమనించాడు. వెంటనే అతను తన నడుము భాగంతో ఆమె నడుమును సున్నితంగా నెట్టాడు (Gentle Nudge). ఆ చిన్నపాటి తోపుతో ఆమె అసంకల్పితంగా ముందడుగు వేసి ఎస్కలేటర్ ఎక్కేసింది. ఆ తర్వాత ఆమె ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణాన్ని కొనసాగించింది. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది.
