“నేను NDA కూటమిలోకి వస్తే మైనారిటీ ఓట్లు రావు..” – అమిత్ షాకు విజయ్ చెప్పిన రహస్య డీల్ ఇదేనా?

తమిళనాడు రాజకీయ చరిత్రలో 2026 అసెంబ్లీ ఎన్నికలు ఒక భారీ పోరాటానికి వేదికగా మారుతున్నాయి. ఈ తరుణంలో నటుడు విజయ్ పార్టీ మరియు బీజేపీ మధ్య ఉన్న సంబంధాల గురించి కొత్త ఊహాగానాలు దావానంలా వ్యాపిస్తున్నాయి.

“నేను ఎన్డీయే (NDA) కూటమిలోకి వస్తే, మైనారిటీల ఓట్లు మనకు రావు. అది మీకు లాభం కాదు, నాకు ఓటమిని మిగులుస్తుంది” అని విజయ్ నేరుగా అమిత్ షాకు ఒక రహస్య ప్రతిపాదన పంపినట్లు రాజకీయ విశ్లేషకులు సమాచారం లీక్ చేశారు. ఈ వ్యూహం ప్రకారం.. విజయ్ ఒంటరిగా పోటీ చేసి డీఎంకే (DMK) మైనారిటీ మరియు దళిత ఓటు బ్యాంకులో భారీ చీలిక తీసుకురావడమే అమిత్ షా ‘మెగా ప్లాన్’ అని తెలుస్తోంది.

డీఎంకే ఓట్లను దెబ్బకొట్టే ‘షాడో ఒప్పందం’
విజయ్ నేరుగా బీజేపీతో చేతులు కలిపితే, ఆయనపై ‘బీజేపీ బీ-టీమ్’ అనే ముద్ర పడుతుంది. దీనివల్ల తటస్థ ఓటర్లు మరియు మైనారిటీలు ఆయనకు దూరం అవుతారు. కానీ, ఆయన ఒంటరిగా నిలబడి ‘సెక్యులర్’ నినాదాలు చేస్తే, డీఎంకేకు వెళ్లే సుమారు 13% మైనారిటీ ఓట్లు మరియు 20% యువత ఓట్లలో సింహభాగం ఆకర్షించే అవకాశం ఉంది. ఇది డీఎంకే గెలుపును నిర్ణయించే ప్రధాన ఓటు బ్యాంకును దెబ్బతీసే ఒక ఎత్తుగడ.

అమిత్ షా లెక్కలు ఏమిటి?
ఢిల్లీ పెద్దల అంచనా ప్రకారం.. 2026లో డీఎంకేను గద్దె దించాలంటే ఆ పార్టీ కూటమి ఓట్లను చల్లాచెదురు చేయాలి. విజయ్ ఒంటరిగా పోటీ చేయడం బీజేపీకి వ్యతిరేకం కాదు, పైగా అది డీఎంకే ఓట్ల తగ్గుదలకు దారితీస్తుందని బీజేపీ భావిస్తోంది. “మీరు మీ కూటమిని బలోపేతం చేసుకోండి, నేను నా దారిలో డీఎంకే ఓట్లను చీలుస్తాను. ఎన్నికల తర్వాత మనం ఒక సానుకూల నిర్ణయం తీసుకుందాం” అనే అవగాహన వీరి మధ్య ఉన్నట్లు సమాచారం.

బీజేపీ షరతులు
విజయ్ కాంగ్రెస్ పార్టీని తన వైపు లాక్కోకుండా ఉండడమే అమిత్ షా ప్రధాన షరతు అని తెలుస్తోంది. ఒకవేళ విజయ్ కాంగ్రెస్‌తో కలిస్తే అది మళ్ళీ బలమైన సెక్యులర్ కూటమిగా మారి బీజేపీ ఎదుగుదలకు అడ్డుకట్ట వేస్తుంది. అందుకే విజయ్ ‘ఒంటరి పోరాటం’ చేయడమే బీజేపీకి ఇష్టం. దీనివల్ల ఓట్లు చీలిపోయి, ఒకవేళ ‘హంగ్ అసెంబ్లీ’ (ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని పరిస్థితి) ఏర్పడితే విజయ్ మద్దతుతో తమిళనాడులో పాగా వేయాలని బీజేపీ యోచిస్తోంది.

డీఎంకే ప్రతివ్యూహం
విజయ్ ప్రతి కదలికను డీఎంకే నిశితంగా గమనిస్తోంది. ఉదయనిధి స్టాలిన్ మరియు ఇతర మంత్రులు విజయ్‌ను “బీజేపీ చేతిలో కత్తి” అని విమర్శించడం వెనుక ఉద్దేశ్యం.. విజయ్‌కు వచ్చే మైనారిటీ ఓట్లను అడ్డుకోవడమే. అయితే, అన్నామలై మరియు అమిత్ షా ఇటీవల విజయ్ పట్ల మెతక వైఖరి ప్రదర్శించడం ఈ ‘రహస్య ఒప్పందం’ నిజమేమో అనే అనుమానాలను బలపరుస్తోంది.


Posted

in

by

Tags: