పడకపై వాలగానే నిమిషంలో గాఢ నిద్ర.. నిద్రపోయే 20 నిమిషాల ముందు ఈ పని చేయండి!

మీకు కూడా రాత్రిపూట నిద్ర పట్టడం లేదా? రాత్రంతా పక్కన కుదురు లేకుండా దొర్లుతూ ఉంటారా? ఇది తీవ్రమైన సమస్య కావచ్చు, ఎందుకంటే నిద్ర లేకపోవడం వల్ల మీ శరీర సహజ లయ (Natural rhythm) దెబ్బతింటుంది. నిద్రమాత్రలు వాడటానికి ముందే ఈ క్రింది నాలుగు సహజ సిద్ధమైన పదార్థాలను ప్రయత్నించి చూడండి.

నిద్ర ఎందుకు అవసరం?

మనం నిద్రపోయే సమయంలోనే మన శరీరంలోని కణాలు తమని తాము బాగు చేసుకుంటాయి (Repair). కొత్త కణాలు పుట్టడం, గాయాలు మానడం మరియు శారీరక ఎదుగుదల ఈ సమయంలోనే జరుగుతాయి. మీ మెదడు కూడా విశ్రాంతి తీసుకుని కొత్త సమాచారాన్ని, జ్ఞాపకాలను నిక్షిప్తం చేసుకుంటుంది. నిద్ర లేకపోతే ఈ ప్రక్రియలన్నీ దెబ్బతింటాయి.

గాఢ నిద్ర కోసం 4 అద్భుతమైన పదార్థాలు:

పోషకాహార నిపుణులు సలోనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ 4 పదార్థాలు 1 నుండి 2 వారాల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే మీ నిద్ర నాణ్యతలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది.

  1. అరటిపండు (నిద్రకు 30-40 నిమిషాల ముందు): రాత్రిపూట స్నాక్స్‌గా అరటిపండును ఎంచుకోండి. ఇందులో ఉండే మెగ్నీషియం మరియు ట్రిప్టోఫాన్ కండరాలకు విశ్రాంతినిస్తాయి. ట్రిప్టోఫాన్ ‘మెలటోనిన్’ (Melatonin) అనే హార్మోన్‌గా మారి నిద్ర చక్రాన్ని క్రమబద్ధీకరిస్తుంది.
  2. గోరువెచ్చని పాలు: మీ జీర్ణవ్యవస్థకు పాలు పడితే, ఇది ఉత్తమమైన మార్గం. పాలలో ఉండే ట్రిప్టోఫాన్ మరియు కాల్షియం నిద్రకు సహాయపడతాయి. ఇందులో చిటికెడు పసుపు మరియు జాజికాయ పొడి కలిపితే ఆందోళన తగ్గి ప్రశాంతత లభిస్తుంది.
  3. గుమ్మడి గింజలు (సాయంత్రం వేళ): గుమ్మడి గింజల్లో జింక్ మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. జింక్ లోపం వల్ల నిద్ర సరిగ్గా పట్టదు. కాబట్టి సాయంత్రం వేళ 1 నుండి 2 చెంచాల వేయించిన గుమ్మడి గింజలను తీసుకోవడం మంచిది.
  4. క్యామోమైల్ టీ (Camomile Tea – నిద్రకు 20 నిమిషాల ముందు): ప్రతిరోజూ రాత్రి ఈ టీ తాగే అలవాటు చేసుకోండి. ఇందులో ఉండే ‘ఎపిజెనిన్’ మెదడును ప్రశాంతపరుస్తుంది. నిద్రపోవడానికి సుమారు 20 నిమిషాల ముందు ఒక కప్పు వేడి క్యామోమైల్ టీ తాగితే నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
గుర్తుంచుకోవలసిన ఇతర విషయాలు:
  • రాత్రి ఉరుముగా కెఫీన్ (టీ, కాఫీ) తీసుకోకండి.
  • రాత్రిపూట భారీ భోజనం చేయడం మానుకోండి.

Posted

in

by

Tags: