టొమాటోలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఈ విషయం తెలిస్తే అస్సలు అలా చేయరు!

టొమాటోలు (Tomatoes) లేకుండా వంట చేయడం దాదాపు అసాధ్యం. చట్నీ నుండి సాంబార్ వరకు ప్రతి వంటకానికి టొమాటోలు కావాల్సిందే. అయితే, మనం మార్కెట్ నుండి తెచ్చిన టొమాటోలను నేరుగా ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటాం. ఇలా చేయడం వల్ల వాటి రుచి మారడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది?

బాగా పండిన టొమాటోలను ఫ్రిజ్‌లో ఉంచవచ్చు, కానీ ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, వాటిని ఐదు రోజుల కంటే ఎక్కువ కాలం ఉంచకూడదు. ఫ్రిజ్‌లోని అతి తక్కువ ఉష్ణోగ్రత టొమాటోలలోని కణ నిర్మాణాన్ని (Cell structure) దెబ్బతీస్తుంది. దీనివల్ల వాటి నాణ్యత తగ్గిపోతుంది. ఒకవేళ మీరు రెండు లేదా మూడు రోజుల్లో వాడే పని అయితే ఫ్రిజ్‌లో పెట్టవచ్చు, లేదంటే బయట ఉంచడమే ఉత్తమం. ఇలా చేయడం వల్ల టొమాటోల నుండి పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు.

వారం కంటే ఎక్కువ కాలం ఉంచితే కలిగే నష్టాలు:

సాధారణంగా టొమాటోలను వారం కంటే ఎక్కువ కాలం ఫ్రిజ్‌లో ఉంచితే, అవి బయటకి బాగానే కనిపించవచ్చు కానీ లోపల కుళ్ళిపోవడం ప్రారంభమవుతుంది.

  • ఆరోగ్య సమస్యలు: ఫ్రిజ్‌లోని అధిక తేమ వల్ల మనకు తెలియకుండానే టొమాటోలు పాడవుతాయి. అటువంటి టొమాటోలను తింటే వాంతులు, విరేచనాలు (డయేరియా) వంటి సమస్యలు రావచ్చు.
  • రోగనిరోధక శక్తి: పాడైన టొమాటోలను వాడటం వల్ల రోగనిరోధక శక్తి బలహీనపడటమే కాకుండా ఇన్ఫెక్షన్ల ప్రమాదం కూడా పెరుగుతుంది.
టొమాటోలను ఎలా నిల్వ చేయాలి?
  1. టొమాటోలు తాజాగా ఉండాలంటే కొన్న వెంటనే వాడటానికి ప్రయత్నించండి.
  2. ఫ్రిజ్‌లో పెట్టాల్సి వస్తే, కూరగాయల కోసం కేటాయించిన డ్రాయర్‌లో మాత్రమే ఉంచండి.
  3. లోపల నల్లటి మచ్చలు ఉన్నా లేదా చెడు వాసన వస్తున్నా ఆ టొమాటోలను అస్సలు వాడకండి.

Posted

in

by

Tags: