ఆధ్యాత్మిక నమ్మకాల ప్రకారం, మనం తినే ఆహారం కేవలం ఆకలిని తీర్చడమే కాకుండా మన మనస్సు, బుద్ధి మరియు ప్రవర్తనపై ప్రభావం చూపుతుంది. అందుకే కింది వ్యక్తుల ఇళ్లలో భోజనం చేయడం వల్ల పాపం చుట్టుముట్టడమే కాకుండా జీవితంలో ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయని గరుడ పురాణం హెచ్చరిస్తోంది.
- నేరస్థులు లేదా శిక్ష అనుభవిస్తున్న వారి ఇల్లు
ఏదైనా నేరం చేసి, అది కోర్టులో నిరూపించబడిన వ్యక్తి ఇంట్లో భోజనం చేయకూడదు. అటువంటి వారి ఇంట్లో తినడం వల్ల, ఆ వ్యక్తి చేసిన పాపంలో మీరు కూడా భాగస్వాములవుతారు మరియు జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. - దైవ నింద చేసేవారు
ఏ దేవుడినైనా సరే దూషించేవారు, అధర్మ మార్గంలో నడిచేవారి ఇంట్లో ఆహారం తీసుకోవడం వల్ల మీకు అపకీర్తి వస్తుంది మరియు పాప ఫలం దక్కుతుంది. - దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్న ఇల్లు
తీవ్రమైన లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారున్న ఇంట్లో భోజనం చేయడం వల్ల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లవచ్చు మరియు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుంది. - అధిక వడ్డీ వసూలు చేసేవారు
ఇతరుల బలహీనతను ఆసరాగా చేసుకుని, అధిక వడ్డీలు వసూలు చేస్తూ క్రూరంగా ప్రవర్తించే వారి ఇంట్లో భోజనం చేయడం వల్ల ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి మరియు మీ ఎదుగుదల కుంటుపడుతుంది. - అబద్ధాలు మరియు చాడీలు చెప్పేవారు
ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతూ, చాడీలు చెబుతూ ఆనందం పొందే వ్యక్తుల ఇంట్లో తినడం వల్ల మీ కర్మ ఫలితం దెబ్బతింటుంది. సామాజిక సంబంధాల్లో చేదు అనుభవాలు ఎదురవుతాయి. - మాదకద్రవ్యాల వ్యాపారులు
మత్తు పదార్థాలను విక్రయిస్తూ అనేక కుటుంబాల నాశనానికి కారణమయ్యే వారి ఇంట్లో భోజనం చేయడం వల్ల మీ జీవితంలోకి ప్రతికూల శక్తి (Negative Energy) ప్రవేశిస్తుంది. దీనివల్ల ఆరోగ్యం, సంపద మరియు ప్రశాంతత దెబ్బతింటాయి.
