వివేకానందుడి ఒక్క మాటతోనే టాటా సామ్రాజ్యానికి పునాది! ఆరోజు ఓడలో జంషెడ్జీతో స్వామిజీ ఏం చెప్పారు?

సంవత్సరం 1893. జపాన్‌లోని యోకోహామా నుండి కెనడాలోని వాంకోవర్‌కు వెళ్తున్న ‘ఎస్ఎస్ ఎంప్రెస్ ఆఫ్ ఇండియా’ అనే ఓడ. ఆ ఓడలోని మొదటి తరగతి విభాగంలో ఇద్దరు గొప్ప వ్యక్తులు కలిశారు. ఒకరు కాషాయ వస్త్రధారి అయిన స్వామి వివేకానంద, మరొకరు భారతదేశపు దార్శనిక పారిశ్రామికవేత్త జంషెడ్జీ టాటా.

ఆ చారిత్రాత్మక సంభాషణ:

ఆ సమయంలో స్వామి వివేకానంద చికాగోలో జరిగే ప్రపంచ మత సమ్మేళనానికి వెళ్తున్నారు. జంషెడ్జీ టాటా పారిశ్రామిక ముడిసరుకు మరియు కొత్త సాంకేతికత కోసం విదేశాలకు వెళ్తున్నారు. సంభాషణలో భాగంగా స్వామిజీ జంషెడ్జీని ఒక సూటి ప్రశ్న అడిగారు:

“మీరు వెతుకుతున్న సాంకేతికత తాళంచెవి బ్రిటిష్ వారి చేతుల్లోనే ఉంటుంది కదా! మరి విదేశాల నుండి ఉక్కును దిగుమతి చేసుకోవడం ఎందుకు? భారతదేశం కేవలం ముడిసరుకును దిగుమతి చేసుకుంటే సరిపోదు; భారతదేశంలోనే ఉక్కు కర్మాగారాన్ని స్థాపించాలి.”

విజ్ఞానమే పునాది:

భారతదేశం పారిశ్రామికంగా ఎదగాలంటే ముందుగా ఉన్నత విద్యాసంస్థలు కావాలని స్వామిజీ సూచించారు. భారతీయ యువత విజ్ఞాన శాస్త్రంలో (Science) శిక్షణ పొందాలని, అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. జంషెడ్జీకి ఒక ఉన్నత విద్యా సంస్థను ఏర్పాటు చేయమని స్వామిజీ సలహా ఇచ్చారు.

IISc స్థాపన మరియు వివేకానందుడి స్పూర్తి:

స్వామిజీ మాటలు జంషెడ్జీ హృదయాన్ని బలంగా తాకాయి. 1898లో జంషెడ్జీ స్వామిజీకి ఒక లేఖ రాస్తూ.. “ఆ ఓడలో జరిగిన సంభాషణ మీకు గుర్తుండే ఉంటుంది. మీ తత్వశాస్త్రం మరియు విజ్ఞాన శాస్త్రం కలిసేలా ఒక విజ్ఞాన కేంద్రం (Science Centre) ఏర్పాటు చేయాలనుకుంటున్నాను” అని పేర్కొన్నారు.

  • బ్రిటీష్ ప్రభుత్వం సహకరించకపోయినా, స్వామి వివేకానంద ప్రేరణతో మరియు ఆయన శిష్యురాలు సిస్టర్ నివేదిత పర్యవేక్షణలో, మైసూరు మహారాజు ఇచ్చిన భూమిలో నేటి ప్రసిద్ధ ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్’ (IISc) రూపుదిద్దుకుంది.

Posted

in

by

Tags: