‘వెంటనే ఇరాన్ విడిచిపెట్టండి’.. భారత పౌరులకు రాయబార కార్యాలయం అత్యవసర హెచ్చరిక!

ఇరాన్ ప్రస్తుతం యుద్ధ మేఘాల మధ్య ఉంది. దేశవ్యాప్త నిరసనల్లో ఇప్పటికే 11,000 మంది మరణించగా, ఆందోళనకారులకు మరణశిక్ష విధించాలని సుప్రీం లీడర్ ఖమేనీ జారీ చేసిన ఆదేశాలతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరసనకారులకు మద్దతుగా ‘సహాయం’ పంపిస్తామని ప్రకటించడంతో, ఇరాన్‌పై అమెరికా దాడి చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాదకర పరిస్థితుల్లో ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం కీలక అడ్వైజరీని జారీ చేసింది.

భారతీయులకు ఇచ్చిన ప్రధాన సూచనలు:

  • వెంటనే నిష్క్రమించండి: ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయ విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు అందుబాటులో ఉన్న కమర్షియల్ విమానాలు లేదా ఇతర రవాణా మార్గాల ద్వారా తక్షణమే దేశం విడిచి వెళ్లాలని సూచించింది.
  • జాగ్రత్తగా ఉండండి: నిరసనలు, గొడవలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలి. ఎప్పటికప్పుడు స్థానిక వార్తలను గమనిస్తూ ఉండాలి.
  • పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి: పాస్‌పోర్ట్, ఐడి కార్డులు మరియు ఇతర ప్రయాణ పత్రాలను ఎప్పుడూ తమ వద్దే ఉంచుకోవాలని భారతీయులకు సూచించారు.
  • హెల్ప్‌లైన్ నంబర్లు: ఏవైనా ఇబ్బందులు ఎదురైతే సంప్రదించాల్సిన అత్యవసర నంబర్లను విడుదల చేశారు.
    • మొబైల్: +989128109115; +989128109109; +989128109102; +989128109159.
    • ఈమెయిల్: cons.tehran@mea.gov.in

Posted

in

by

Tags: