జలుబు, దగ్గుకు అద్భుత ఔషధం.. కేవలం మూడు లైన్ల 63 ఏళ్ల క్రితం నాటి ప్రిస్క్రిప్షన్ వైరల్!

సోషల్ మీడియాలో 1962 నాటి ఒక పాత ప్రిస్క్రిప్షన్ వైరల్ అవుతోంది, ఇది చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఒక మహిళ తన ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు, ఆమె కుటుంబ సభ్యుడి కోసం రాసిన ఈ పాత చిట్కా పత్రం దొరికింది. నేటి ఆధునిక వైద్యంలో జలుబు వంటి చిన్న సమస్యకు కూడా యాంటీబయాటిక్స్, ఖరీదైన సిరప్‌లు వాడుతున్న తరుణంలో, ఈ పాత ప్రిస్క్రిప్షన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

వైరల్ ప్రిస్క్రిప్షన్‌లో ఏముంది?: ఆ కాలంలో వైద్యుడు ఎటువంటి ఖరీదైన మందులు రాయకుండా, కేవలం మూడు లైన్లలో పరిష్కారాన్ని సూచించారు. ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారం.. జలుబు తగ్గడానికి:

  1. ఒక స్పూన్ విస్కీ (Whiskey)
  2. ఒక స్పూన్ నిమ్మరసం (Lemon Juice)
  3. ఒక స్పూన్ తేనె (Honey) ఈ మూడింటిని కలిపి నిర్ణీత సమయాల్లో తీసుకోవాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ‘హాట్ టోడీ’ (Hot Toddy) గా పిలవబడే ఈ చిట్కా ఇంటర్నెట్‌లో కేవలం కొద్ది సమయంలోనే 50 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. ఖరీదైన వైద్యం కంటే పాత కాలపు ఈ ఇంటి వైద్యమే మేలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Posted

in

by

Tags: