ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌లోని ఒక హోటల్లో మద్యం మత్తులో జరిగిన గొడవలో ప్రియురాలిని కొట్టి చంపి, రాత్రంతా ఆమె శవంతోనే గడిపిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏం జరిగిందంటే? ఘజియాబాద్‌లోని పటేల్ మార్గ్ ప్రాంతంలో ఉన్న ఒక హోటల్లో ప్రవీణ్ కుమార్ మరియు ఆర్తి కుమార్ అనే జంట బస చేశారు. అర్ధరాత్రి సమయంలో వారిద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన ప్రవీణ్, ఆర్తిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ప్రవీణ్ రాత్రంతా ఆమె శవంతోనే ఆ గదిలో గడిపాడు. మరుసటి రోజు ఉదయం ఆర్తికి ఒంట్లో బాలేదని చెప్పి హోటల్ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించగా, అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది అతడిని పట్టుకున్నారు.
పోస్టుమార్టం రిపోర్ట్: మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టంలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రవీణ్ దాడికి ఆర్తి పక్కటెముకలు విరిగిపోయాయని, ఊపిరితిత్తులు మరియు కాలేయం (Liver) తీవ్రంగా దెబ్బతిన్నాయని వైద్యులు తేల్చారు. నందగ్రామ్ పోలీసులు హత్య కేసు నమోదు చేసి ప్రవీణ్‌ను జైలుకు పంపారు.
