ఇరాన్లో కొనసాగుతున్న హింసాకాండ మధ్య, అక్కడి ప్రజలకు సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీపై ఉన్న నమ్మకం పూర్తిగా సన్నగిల్లింది. నిరసనకారులను అణచివేయాలని ఖమేనీ ఇచ్చిన ఆదేశాల తర్వాత వీధుల్లో మృతదేహాల కుప్పలు కనిపిస్తున్నాయి. దీంతో సామాన్య పౌరులు తమ ఇళ్లలో కూడా రక్షణ లేదని భావించి పొరుగు దేశాలకు పారిపోతున్నారు.
తుర్కియే సరిహద్దు వద్ద దృశ్యాలు: రాయిటర్స్ కథనం ప్రకారం.. బుధవారం నాడు తుర్కియేలోని వాన్ ప్రాంత్ సరిహద్దు వద్ద భారీ సంఖ్యలో ఇరానియన్లు తమ సామాన్లతో సూట్కేసులు ఈడ్చుకుంటూ దేశం దాటుతున్నారు. వారి కళ్లలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. మీడియా ప్రతినిధులతో మాట్లాడితే తమ ప్రాణాలకు ముప్పు వస్తుందన్న భయంతో వారు మౌనంగా సరిహద్దులు దాటుతున్నారు. వీరంతా ‘కాపీకోయ్’ బోర్డర్ ద్వారా తుర్కియేలోకి ప్రవేశించి సమీప పట్టణాలకు చేరుకుంటున్నారు.
అంతర్జాతీయ అడ్వైజరీ: పరిస్థితి తీవ్రతను గమనించిన భారత్ మరియు అమెరికా వంటి దేశాలు తమ పౌరులను తక్షణమే ఇరాన్ వదిలి రావాలని ట్రావెల్ అడ్వైజరీ (Advisory) జారీ చేశాయి. రాబోయే 24 గంటల్లో ఇరాన్లో ఏదైనా పెద్ద సంఘటన లేదా యుద్ధం లాంటి పరిస్థితి సంభవించవచ్చని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
