బ్రిటన్ రాజకీయాల్లో ఒక చిన్న వ్యాఖ్య పెను తుఫానును సృష్టించింది. హౌస్ ఆఫ్ కామన్స్ (బ్రిటన్ పార్లమెంట్) లో ప్రశ్నల సమయంలో ప్రధాని కైర్ స్టార్మర్ తన విధానాల కంటే, ఒక వివాదాస్పద వ్యాఖ్య కారణంగా వార్తల్లో నిలిచారు. విపక్ష నాయకురాలు కెమీ బాడెనోక్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లోని అస్థిరతను ప్రశ్నిస్తూ, ప్రభుత్వం పదేపదే తన నిర్ణయాలను మార్చుకుంటోందని (యూ-టర్న్‌లు) విమర్శించారు.
ప్రధాని చేసిన వ్యాఖ్య: కెమీ బాడెనోక్ విమర్శలకు సమాధానమిస్తూ ప్రధాని స్టార్మర్.. “గత 14 ఏళ్లలో విపక్షాలు (కన్జర్వేటివ్ పార్టీ) కామసూత్రలో ఉన్న పొజిషన్ల కంటే ఎక్కువసార్లు తమ పొజిషన్లను (నిర్ణయాలను) మార్చాయి. అందుకే వారు అలసిపోయారు, దేశ పరిస్థితిని కూడా దిగజార్చారు” అని వ్యాఖ్యానించారు.
పార్లమెంటులో స్పందన: ప్రధాని ఈ మాట అనగానే సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. ఒక తీవ్రమైన రాజకీయ చర్చ జరుగుతున్న సమయంలో ఇలాంటి భాష వాడటం పార్లమెంటు గౌరవానికి విరుద్ధమని విపక్షాలు మండిపడ్డాయి. ఇది ‘చాలా తక్కువ స్థాయి హాస్యం’ అని, మహిళా నేతను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని సోషల్ మీడియాలో కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
