బెంగళూరు: బంగ్లాదేశ్‌కు చెందిన కొందరు వ్యక్తులు అక్రమంగా దేశంలోకి చొరబడి, భారతీయ పౌరులకు ఉండాల్సిన ఓటర్ ఐడి, ఆధార్, రేషన్ కార్డు మరియు డ్రైవింగ్ లైసెన్స్ వంటి కీలక పత్రాలను అక్రమ మార్గాల్లో పొంది ఇక్కడే నివాసం ఉంటున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
కేవలం ₹1500 లంచం ఇచ్చి వీరు ఆధార్ కార్డులు పొందినట్లు సమాచారం. ఈ నకిలీ పత్రాలను ఉపయోగించి, భారత ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ, సాధారణ పౌరులలాగే జీవించడం దేశ భద్రతపై ఆందోళనలను పెంచుతోంది.
ఈ వ్యవహారంలో మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. ఆ నకిలీ పత్రాలను చూపి బ్యాంకుల్లో పలు లక్షల రూపాయల రుణాలు (Loans) పొందడమే కాకుండా, ద్విచక్ర మరియు నాలుగు చక్రాల వాహనాలను కూడా వాయిదాల పద్ధతిలో (EMI) కొనుగోలు చేశారు. చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించిన వారు ఇంత సులభంగా ప్రభుత్వ మరియు బ్యాంకింగ్ వ్యవస్థలను ఏమార్చడం పెద్ద చర్చకు దారితీసింది. దీనిపై అధికారులు తీవ్ర స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఈ మోసానికి సహకరించిన మధ్యవర్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
